జీతాలకే దిక్కులేదు... మెట్రో రైళ్లా?!
గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం ‘ఇంటర్ బేసిన్ ట్రాన్స్‌ఫర్’ అవుతుంది. అలా జరిగిన మరుక్షణమే 90 టీఎంసీల కృష్ణా నీటిని అదనంగా వినియోగించుకునే హక్కు ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలకు ఏర్పడుతుంది. దాంతో శ్రీశైలం జలాశయం మాట ఆ మల్లికార్జునుడే ఎరుగుగానీ, కృష్ణానది నీరు అంతకంటే ముందే ఉన్న జూరాలకే చేరవు.
‘అడుక్కుతినే వాడికి ఇద్దరు పెళ్లాలు ఎందుకయ్యా?’ అం టూ ఓ కాలం నాడు శ్రీనా థుడు సాక్షాత్తూ ఆ పరమేశ్వ రుణ్ణే నిలదీశాడు. ఆయన ఈ మాట అని ఇప్పటికి 600 సంవత్సరాలు దాటిపోయిం ది. ఇప్పుడా మాట ఎందుకు గుర్తుకొచ్చిందంటే- ఏ పను లకు ప్రాధాన్యత ముందు ఇవ్వాలో నిర్ణయించుకునే విజ్ఞతను కోల్పోయిన మన రాష్ట్ర ప్రభుత్వం పథకాలను చూసి.
వర్షాలు లేవు, పంటకు నోచుకోకుండా రుతు వుకు రుతువే దాటిపోయింది. వ్యాపారాలు లేవు, వడ్డీలు చెల్లించలేక వర్తకులు దివాలా తీస్తున్నారు. ఆర్థిక వనరులు లేవు, అడుక్కునేందుకు ఢిల్లీ చుట్టూ ఎంత తిరిగినా, ‘ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు’ అన్న సామెతగా, అక్కడి నుంచి రాలేదేమీ కనిపించ డం లేదు. ఈ ప్రధాన మంత్రి నుంచి రాలేదేమీ ఉం డదుగూడా. ఎందుకంటే- ‘నాకు మించిన మొన గాడు లేడు’ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన విదేశీ పర్యటనల హంగామా, పబ్లిసిటీ కోసం చేసుకున్న ఒప్పందాలూ తదితర ప్రవర్తనను ఈ ప్రధానేగాదు, ఏ ఇతర ప్రధాన మంత్రి ఓర్చుకునేవిగా లేవు. విదేశీ విధానమనేది సంపూర్ణంగా కేంద్ర ప్రభు త్వం పరిధిలోని అధికారం; ఈ రంగంలో మన రాజ్యాం గం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆవగింజంత అధికారమైనా ఇవ్వలేదు.
మన ముఖ్యమంత్రి చేసిన పర్యటనల్లో ఏ ఒక్కటీ అధికారికమైంది కాదు కాబట్టి, అక్కడి సమావేశాలకు హాజరైంది ప్రైవేటు కంపెనీల మేనేజర్లే తప్ప, స్థాయి కలిగిన రాజకీయ నాయకుడెవ్వరూ ముఖమైనా చూపిం చలేదు. ఈపాటి సంప్రదింపులకు ఏ పారిశ్రామిక ప్రము ఖుణ్ణి పంపినా చేసుకురాగలడు. ఊడిగం చేసే మీడి యాను వెంటదీసుకుని, ‘తగుదునమ్మా’ అంటూ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు చేసిన నిర్వాకంవల్ల నష్టం ఎంత జరిగిందో మామూలు పౌరుడు ఎలా అంచనా వేయగలడు? ఏదో వస్తుందని, పాపం, ఏడాది దాటినా ఎదురు చూస్తూనే కూర్చున్నాడు.
ప్రజలను ఉద్ధరించేందుకే అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆర్భాటాల్లో ‘పట్టిసీమ’ ప్రణాళిక మరొకటి. అసలు సంగతి దాచకుండా - ఆంధ్ర, కర్ణా టక, మహారాష్ట్రల మధ్య ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు హయాంలో జరిగిన ‘మూడు పార్టీల’ పరస్పర ఒప్పందాన్ని వెలికితీస్తే - ఆ ప్రణాళిక ‘పట్టిసీమ’ కాదు, ‘ఒట్టిసీమ’ అవుతుంది. ఉన్న నిబంధనలు పరిశీలిస్తే, గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం ‘ఇంటర్ బేసిన్ ట్రాన్స్‌ఫర్’ అవుతుంది. అలా జరిగిన మరుక్షణమే 90 టీఎంసీల కృష్ణా నీటిని అదనంగా వినియోగించుకునే హక్కు ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలకు ఏర్పడు తుంది. దాంతో శ్రీశైలం జలాశయం మాట ఆ మల్లికా ర్జునుడే ఎరుగుగానీ, కృష్ణానది నీరు అంతకంటే ముందే ఉన్న జూరాలకే చేరవు. ఇక తుంగభద్ర నీళ్లంటారా- వాటిని కళ్లతో చూసే యోగం తుంగభద్ర ఎగువ కాలు వకే ఉండబోదు.
రాష్ట్రానికి రాజధానిని అమరావతిలో నిర్మించాలని ఏవేవో కబుర్లు చెబుతున్నారు. నిజంగా అక్కడ రాజ ధాని నిర్మించే ఆలోచనే ఉంటే, మెట్రో రైళ్ల కోసం ఉన్న పట్టణాల్లో కట్టడాలను కూల్చేసి, కాంక్రీటు స్తంభాల మీద పట్టాలు నడుపుకోవడం కంటే, కట్టబోయే పట్ట ణంలో ఇప్పుడు చెన్నైలో ఉన్నట్టుగా నేల మీదనే మెట్రో లను నడుపుకునే అవకాశం ఎంతైనా ఉంది. అలా చేస్తే అంచనా ఖర్చుల్లో 80 శాతం తగ్గిపోతుంది.
కానీ, ప్రమాదం వచ్చేదంతా ఎక్కడంటే - నాయ కులకు ముట్టే మామూలు కూడా అదే శాతంలో పడిపో తుంది. ఇదివరకటి నాయకులు ఉన్న రాజధానిలో స్థలాలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారో ఏమోగానీ, లేని రాజధానిలో స్థలాల వ్యాపారం చేస్తున్న ఇప్పటి నేతలు ఆ నష్టాన్ని ఓర్చుకోవడం అంత సులభం కాదేమో!
విజయవాడకు మెట్రో అనడంలోని అంతరా ర్థం కూడా మనం కొద్దిగా తెలుసుకోనుండాలి. అను కున్నట్టు అమరావతిలోనే రాజధాని అంటూ ఏర్ప డితే, నగరంగా విజయవాడకు మనుగడే కష్టం. మూకుమ్మడిగా విజయవాడ అమరావతికి తరలిపో తుంది. ఇంగితమనేదే ఉంటే, ఆ రైలేదో అమరావతి లోనే మొదలెట్టి, ఇప్పటి ప్రయత్నాలు విరమిస్తే ప్రజలకు ప్రయోజనంగా ఉంటుంది.
దేశ విభజనకు ముందు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్య పట్టణంగా లాహోర్ ఉండేది. విభజన తరువాత అది పాకిస్తాన్‌కు వెళ్లిపోయింది. కేవలం 68 సంవత్సరాలకు పూర్వం, మన భాగంగా వచ్చిన పంజాబ్ రాష్ట్రానికి ముఖ్య పట్టణం కట్టుకునే అవసరం తన్నుకొచ్చింది. అప్పటికప్పుడు చండీగఢ్ ‘ప్లాన్డ్ సిటీ’ - అంటే పథకం ప్రకారం నిర్మించిన నగరం - పుట్టు కొచ్చింది. అందు కోసం పరదేశం నుంచి దిగుమతి చేసు కున్న ఇంజనీర్లు లేరు; పనిజేసిందంతా అచ్చంగా స్వదేశీ ఇంజనీర్లు. దేశంలోని ఇంజనీర్లను హీనం చేసి, అల్లంత దూరం నుంచి అరువుకు పిలిపించుకున్న ఇంజనీర్ల యినా ఇలాంటి విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారో లేదో? మనకేం తెలుసు, అసలు వాళ్లు ఇంజనీ ర్లేనో కాక వాటాదారులో!
- ఎం.వి. రమణారెడ్డి
వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు, 94402 80655