ఏమిటీ ‘గామా’ గానం? | narendra modi invited the Foreign Direct Investment | Sakshi
Sakshi News home page

ఏమిటీ ‘గామా’ గానం?

Published Mon, Oct 6 2014 11:24 PM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

ఏమిటీ ‘గామా’ గానం? - Sakshi

ఏమిటీ ‘గామా’ గానం?

వాస్కోడగామా అసలు రంగునూ చరిత్రనూ మోదీ మరచిపోయారా? లేదా భారత ప్రజలను కావాలని ఆ విషయాల నుంచి మభ్యపరచాలని భావిస్తున్నారా? ఇండియాకు సముద్రమార్గం కనుగొన్నానని ప్రగల్భించిన వాస్కోడగామా పదిహేనో శతాబ్దంలో తన బృందంతో చేసిన మూడు యాత్రలు కేవలం డిస్కవరీలు కాదు. వర్తక వాణిజ్య దోపిడీలు. నరమేధ యాత్రలు. అతడి యాత్రలు సముద్రమార్గంతో యూరప్-ఆసియా ఖండాలను కలిపేందుకు మొదటిసారి ఆస్కారం కల్పించాయి. ఈ విధంగా పోర్చుగీసు బుడతకీచు వాస్కోడగామా యాత్ర ఆసియాలో వలస సామ్రాజ్యాధిపత్యానికి అంకురార్పణ చేసింది.
 
ప్రత్యక్ష సంబంధాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటూ; ట్విట్టర్‌తో, ట్వీట్లతో విన్యాసాలు చేయడానికి అలవాటుపడిన ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యట నకుముందు, ఆ దేశంలో పర్యటిస్తున్న సమయంలోను మన దేశ ప్రజలు ఈసడించుకునే కొన్ని విషయాలను ఎలాంటి వెరపూ లేకుండా చెప్పారు. ‘భారత్ అభివృద్ధి’ అనే నినాదం చాటున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సమ ర్థిస్తూ మాట్లాడినపుడు మోదీ పోర్చుగీసు యాత్రికుడు వాస్కోడగామాను ఆదర్శంగా చూపించారు. భారత ఉప ఖండాన్ని, ఆఫ్రికా దేశాలను యూరప్ వలస సామ్రాజ్య వాదులు దోచుకోవడానికి వీలుగా ఒక సముద్ర మార్గాన్ని కనుగొన్నవాడే వాస్కోడగామా. ప్రపంచ దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలను, ద్వైపాక్షిక సంబంధాలను మన దేశం కొనసాగించడం వేరు. ఆ సంబంధాలను బలోపేతం చేసుకునే క్రమంలో చరిత్రను వక్రీకరించడం వేరు.

బారులు తీరవలసినది ‘గామా’లా?

భారత్‌లోనే దేశవాళీ పద్ధతులలో అపారమైన వనరులను వినియోగించుకుని వస్తూత్పత్తిని ఇబ్బడిముబ్బడిగా సా గించే పద్ధతికి (మేడ్ ఇన్ ఇండియా) సున్న చుట్టి, ప్రపంచ పెట్టుబడిదారులంతా వచ్చి ఇక్కడ వస్తువులను ఉత్పత్తి చేసి (మేక్ ఇన్ ఇండియా) పెట్టండని ఆహ్వానించే స్థితికి పాలకులు దిగజారిపోయారు. ‘ప్రపంచమే మన దేశాన్ని వెతుక్కుంటూ వస్తుంది’ అనీ, రావాలనీ ప్రధాని మోదీ కోరుకోవడం మంచిదే. కానీ అలా దేశానికి ‘ప్రపంచాన్ని రప్పించుకునే’ పద్ధతిని ప్రతిపాదించడంలో మోదీ దృష్టి వక్రీకరించింది. ఇక మీదట ‘వాస్కోడగామాలు మన దేశా నికి రావడానికి బారులు తీరుతారు, అన్వేషిస్తూ మరీ వస్తా రు’ అంటూ ప్రధాని అభినవ వాస్కోడగామాలకు ఆహ్వా నం పలికారు. నిజానికి ‘దేశాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు అనుకుంటే పెట్టుబడుల విషయంలో, గుత్త కంపెనీల, కార్పొరేట్ల కార్యనిర్వహణలో అవి జోక్యం చేసు కోరాదు. నియంత్రణ పద్ధతులను మానుకోవాలి. కేవలం సానుకూల శక్తిగానే’ వ్యవహరించాలన్న పథకంతోనే ప్రపంచ బ్యాంక్ దేశంలోకి దూసుకు వచ్చింది. అలాగే ‘మా దేశంలో లేని వస్తువును మీ దేశానికి వచ్చి ఉత్పత్తి చేస్తాం. మీ దేశంలో తయారు చేయడం వీలుకాని వస్తువు లను మా దేశంలో ఉత్పత్తి చేసి మీకు ఎగుమతి చేస్తాం. ఈ రకమైన పరస్పర సానుకూల వాతావరణం సృష్టించుకుం దాం’ అనే నినాదాన్ని ముందుకు నెట్టింది కూడా నయా వలస సామ్రాజ్యాధిపతులేనన్న సంగతి విస్మరించలేం. అమెరికా, బ్రిటన్‌ల దోపిడీ విధానాలతోనే ప్రపంచ బ్యాం క్ అడుగులు వేస్తుందన్నది సత్యం. ఆ పూర్వరంగంలోనే మోదీ ప్రపంచ కార్పొరేట్ గుత్త పెట్టుబడిదారులందరికీ వారి తోడ్పాటుతో దేశీయ దళారీ కార్పొరేట్ గుత్త వర్గాలకు ‘వాస్కోడగామాలై’ తరలి రమ్మని ఆహ్వానం పలికారు.

మభ్యపెట్టదలచుకున్నారా?

వాస్కోడగామా అసలు రంగునూ చరిత్రనూ మోదీ మరచి పోయారా? లేదా భారత ప్రజలను కావాలని ఆ విష యాల నుంచి మభ్యపరచాలని భావిస్తున్నారా? ఇండి యాకు సముద్రమార్గం కనుగొన్నానని ప్రగల్భించిన వాస్కోడగామా పదిహేనో శతాబ్దంలో తన బృందంతో చేసిన మూడు యాత్రలు (1497, 1499, 1502) కేవలం డిస్కవరీలు కాదు. వర్తక వాణిజ్య దోపిడీలు. నరమేధ యాత్రలు. అతడి యాత్రలు సముద్రమార్గంతో యూర ప్-ఆసియా ఖండాలను కలిపేందుకు మొదటిసారి ఆస్కా రం కల్పించాయి. ఈ విధంగా పోర్చుగీసు బుడతకీచు వాస్కోడగామా యాత్ర ఆసియాలో వలస సామ్రాజ్యా ధిపత్యానికి అంకురార్పణ చేసింది. దానితో పాటే అది ప్రపంచ సామ్రాజ్యవాద శకానికి పురుడుపోసింది. వాస్కో డగామా యాత్ర ప్రధాన లక్ష్యం - కేరళ కోస్తా తీరంలోని కాలికట్ ప్రాంతంలో దొరికే లవంగాలు, యాలకులు వం టి విలువైన సుగంధ ద్రవ్యాలను దోచుకుని పోర్చుగల్‌కు తరలించడమే. కాలికట్‌కు చేరిన పోర్చుగీస్ బృందం లేదా నావికులు స్థానికులను క్రైస్తవులుగా భావించారు. కాబట్టి తమ పలుకుబడి పనికి వస్తుందని నమ్మారు. కాలికట్ పాలకుడు హిందువు (భారతీయుడు). దీనికితోడు బుడత కీచులు స్థానికులూ, వర్తకులూ అయిన ముస్లింలతో ఘర్ష ణలకు దిగారు. అంతేకాకుండా కాలికట్ స్థానిక పాలకుడు జామెరిన్‌ను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక వాణిజ్య పంటలనీ, సుగంధ ద్రవ్యాలనీ కాజేసి అందుకు ప్రతిగా పోర్చుగల్ నుంచి తెచ్చిన చౌకబారు సరుకును నజరానాగా ఇవ్వబోయారు. ఇందుకు జామెరిన్ తిరస్కరించాడు. దీనితో హతాశుడైన వాస్కోడగామా తోక ముడిచాడు. కానీ రెండవసారి వచ్చినపుడు అక్కడ వ్యాపా రం చేస్తున్న అరబ్బుల (ముస్లింలు) మీద అతడి అనుయా యులు దాడులకు దిగారు. కాలికట్ పాలకునితో ఒప్పం దం విఫలమైందన్న అక్కసుతో వాస్కోడగామా స్థానిక ముస్లింల మీద విరుచుకుపడ్డాడు. ఇతడి చొరవతోనే ఒక్క సుగంధ ద్రవ్యాలనే కాకుండా యూరప్ ఖండానికే పరిచ యం లేని ఎన్నో భారతీయ ఉత్పత్తులను సహితం తరలిం చుకుపోవడానికి ఆస్కారం కలిగింది. బుడతకీచులే కాకుం డా ఇతర యూరోపియన్ వలస రాజ్యాలకు ఇలాంటి దోపిడీకి ఇతడే మార్గం చూపాడు. వలస దేశాలను తమ దోపిడీకి ‘పెరటి స్థలాలు’గా మార్చుకునే తొలి ‘ప్రపం చీకరణ’ వాస్కోడగామాతోనే చరిత్రలో ఆరంభమైందని మరువరాదు. బంగారం, ఏనుగు దంతాలు, బానిస వ్యాపారానికి దారులు తెరిచినవాడు కూడా అతడే. ఇలాం టి నరమేధాలతోనే ఈ నావికులు వారి రాచరిక ఖజానాను నింపి సామ్రాజ్య విస్తరణకు తోడ్పడ్డారు.

సముద్రపు దొంగ అవతారం

కెన్యా (ఆఫ్రికా) ప్రాంతంలో ఈ ‘గామా’ సముద్రపు దొం గగా కూడా మారిపోయి దోపిడీలకు ఒడిగట్టాడు. నిరాయు ధంగా భారత సముద్ర తీరాలలో సాధారణ వర్తకం చేసు కుంటున్న అరబ్‌లను తమకు పోటీగా భావించిన వాస్కో డగామా అనుయాయులు వారిని నానా హింసలు పెట్టా రు. ఇలాంటి  పరిణామాలతోనే  తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్ ప్రజలు కోపోద్రిక్తులై దాడికి దిగితే కాలికి బుద్ధి చెప్పిన ‘సాహసికుడు’, ‘గొప్ప నావికుడు’ ఈ వాస్కోడగామాయే. తిరుగుబాటు చేశారన్న కక్షతో మొజాంబిక్ నగర ప్రజల మీద ఫిరంగులతో కాల్పులు జరిపించిన ఘనుడు కూడా అతడే. మొంబాసా రేవులో కూడా ఇలాంటి అకృత్యాలకే ఈ గామా పాల్పడ్డాడు. అంతేకాదు, ఈ ‘గామా’ దోపిడీలో సహకరించిన సరంగు ఒక గుజరాతీయేనని కథనం. కాగా, భారత సముద్ర తీరా లలో కనిపించిన అరబ్‌ల నౌకలను ‘గామా’ బృందం దురాక్రమించడం మరొక ఘట్టం. కేరళలోని కాలికట్‌ను కేంద్రంగా చేసుకుని తూర్పు ఆఫ్రికా బంగారు నిల్వలను కాస్తా ఊడ్చేసుకుపోయాడు. మక్కా నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్న నిరాయుధ ముస్లిం యాత్రికుల నౌకల పైన కూడా దాడి చేసి, వారిని దారుణ రీతిలో ఊచకోత కోసిన వాడు కూడా ఈ వాస్కోడగామాయే. తన రెండవ సాహసిక యాత్రలో ఈ గామా మరొక ఘనకార్యం కూడా చేశాడు. కాలికట్ నుంచి మక్కా యాత్రకు మాదావి రేవు పట్నం నుంచి వెళుతున్న ముస్లిం యాత్రికుల నౌకను అతడు అడ్డుకున్నాడు. దానిని లూటీ చేసి అందులో ఉన్న యాభై మంది మహిళలు సహా నాలుగు వందల మందిని చిత్రహింసలు పెట్టి కిరాతకంగా హతమార్చాడు. వీటిని కళ్లారా చూసిన ధోమ్ లాపెడ్, గాస్పర్ కోరియో కళ్లకు కట్టి నట్టు అక్షరబద్ధం చేశారు. ఇంతటితోనే ‘గామా’ రక్తదాహం తీరలేదు. ఒక సందర్భంలో ఈజిప్ట్ రాయబారిని, నిర్బం ధంలోకి తీసుకున్న ప్రయాణికులను తగులబెట్టించాడు. తమ సంపదనంతా తీసుకుని, తమను ప్రాణాలతో విడిచి పెట్టమని వారంతా ప్రాథేయపడినా ‘గామా’ కనికరిం చలేదు. చివరికి తనకు రకరకాలుగా సాయపడిన కాలికట్ నాయర్‌లను, నంబూద్రీలను కూడా అతడు విడిచిపెట్ట లేదు. ముస్లింలతో పాటు, స్థానిక మత పెద్దల చెవులనూ పెదాలనూ కోయించాడు. నంబూద్రీలకు కుక్క చెవులు తగిలించి మరీ ఆనందించాడు. ఇండియా సంపదను కొల్ల గొట్టడానికీ, యుద్ధ నౌకలను నడిపించి బీభత్సం సృష్టిం చినందుకూ, ఇక్కడ తిష్టవేయడానికి వీలుగా సముద్ర మార్గం చూపినందుకూ వాస్కోడగామాకు ‘గవర్నర్ ఆఫ్ ఇండియా’ పేరుతో పోర్చుగల్ ప్రభుత్వం బిరుదు ప్రదా నం (1524) కూడా చేసింది.
 
ఇతడా ఆదర్శం?

ఇలాంటి వాస్కోడగామా పేరుతో విదేశీ గుత్త పెట్టుబడి దారులంతా తరలి రావాలని మోదీ పిలుపునివ్వడం ఏమి టి? 2002లో ఈ మోదీ రాజధర్మం తప్పాడని బీజేపీ అగ్ర నేత వాజపేయి ఎందుకు మందలించవలసి వచ్చిందో ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ మందలింపు ఎందుకో అర్థం చేసుకోవాలి కూడా.     
 
 ఏబీకే ప్రసాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement