రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూమిలో తిరిగి జీవశక్తిని నింపడానికి ఉపయోగపడే ఒక సహజ పద్ధతి ‘రామబాణం’. అందుబాటులో ఉన్న వనరులతోనే రైతులు పొలంలో దీన్ని సులభంగా అమలు చేయవచ్చు. వరుసగా రెండు పంటలకు ముందుగా ఈ పద్ధతిని అమలు చేస్తే.. ఆ భూమి పూర్తిగా సారవంతమవుతుందని ‘రామబాణం’ రూపకర్త డా. పత్తిపాటి రామయ్య చెప్పారు..
1వ రోజు: ఎకరం భూమిని ఎద్దులతో దున్నించాలి.
2వ రోజు: ఉదయం 6 గం.కు- రెండుంపావు కిలోల అల్లం రుబ్బి 4 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి.
9వ రోజు: ఉదయం 6 గంటలకు- 4 కిలోల నాటు ఆవు పేడను 6 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి. సాయంత్రం 6 గంటలకు- మురిగిన అల్లం ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
14వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన పేడ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
17వ రోజు: ఉదయం 6 గంటలకు- 8 కిలోల బెల్లం 12 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి.
19వ రోజు: సాయంత్రం 6 గంటలకు- 3 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
22వ రోజు: ఉదయం 6 గంటలకు- కుండలో 4 లీటర్ల నీటితో రెండుంపావు (2.25) కిలోల ఇంగువ కలిపి పాతిపెట్టాలి.
24వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన బెల్లం ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
27వ రోజు: ఉదయం 6 గంటలకు- 4 కిలోల మంచి శనగపిండిని కుండలో 1 లీటరు నీటితో కలిపి పాతి పెట్టాలి.
29వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన ఇంగువ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
34వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన మంచి శనగపిండి ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.
36వ రోజు: ఉదయం 6 గంటలకు- ఒకటిన్నర (1.5) లీటర్ల నాటు ఆవు పెరుగులో ఒకటిన్నర (1.5) లీటర్ల నీటిని కుండలో కలిపి మజ్జిగ చేసి భూమిలో పాతి పెట్టాలి.
40వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన మజ్జిగను 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
ప్రకృతి వ్యవసాయం, ‘రామబాణం’పై ఆసక్తి కలిగిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా: డా. కె.గంగాధరం (098490 59573), వర్డ్ ప్రకృతి వ్యవసాయ పాఠశాల, చెంచురాజు కండ్రిగ, పిచ్చాటూరు మండలం, చిత్తూరు జిల్లా.
40 రోజుల్లో నవజీవం..!
Published Sun, Mar 16 2014 11:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement