హోదా పరిహాసమేనా? | No use of AP special status ? | Sakshi
Sakshi News home page

హోదా పరిహాసమేనా?

Published Tue, Sep 15 2015 1:21 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

No use of AP special status ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయం ‘కేంద్రానికి చెల గాటం, రాష్ట్రానికి ప్రాణసంకటం’గా మారింది. గత ఎన్నికలకు ముందు మోదీ.. విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగింది, న్యాయం చేస్తామన్నారు. ‘ఆ హోదా ఐదేళ్లిస్తే చాలదు, పదేళ్లపాటు ఉండాల్సిందే’నని వెంకయ్యనాయుడు ఎలుగెత్తారు. ఇప్పుడు వారే ‘చట్టంలో ఆ విషయం పేర్కొనలేదు, నాటి ప్రధాని నోటి మాటగా చెప్పారు’ అంటూ గత ప్రభుత్వ తప్పులను ఏకరువు పెడుతున్నారు. తప్పు వారే చేసినా, దిద్దాల్సింది నేటి పాలకులుగా వీరే కదా! పస్తులున్న వారికి తిండి పెట్టడం ముఖ్యం కాని, ముందున్న వారు వండి పెట్టలేదని నిందిస్తూ కూర్చోవడం ఏం సబబు? విభజన చట్టంలో హోదా ఊసులేక పోతే, సవరించి ప్రవేశపెట్టడం కేంద్రానికి చిటికెలో పని.
 
 మునుపటి ప్రధా ని నోటిమాటకు విలువలేదంటే అది ప్రధాని పీఠాన్ని అవమానించినట్టే. ఇతర రాష్ట్రాల ఎన్నికల లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఏపీకి  అన్యా యం చెయ్యడంలో భాజపాకు రాజకీయ లబ్ధి ఉండొచ్చు. కానీ మాట తప్ప డంలోని నైతిక స్థాయి దిగజారడం మాటో? అది ఆ పార్టీకి, నాయకత్వానికీ దీర్ఘకాలికంగా నష్టదాయకం కాదా! వీటన్నింటికీ మించి... ప్రత్యేక హోదా దయాభిక్ష కాదు. రాష్ట్రానికి రావాల్సిన హక్కు. అడ్డగోలు విభజనలో కేంద్రం ఇచ్చిన అధికారిక హామీ. జరిగిన నష్టానికి కావాల్సిన ఊరట. రాష్ర్ట, కేంద్ర పాల కులు ఏ పార్టీ వాైరైనా ఔదల దాల్చాల్సిన నిర్ణయం.  
 డా. డి.వి.జి.శంకరరావు  మాజీ ఎంపి,
 పార్వతీపురం, విజయనగరం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement