చాచా చారిత్రక తప్పిదం
రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2011 సంవత్సరంలో ఒక సర్వే నిర్వహించింది. డ్యామ్‌లు, గనుల తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల నిర్మాణం, జాతీయ పార్కుల ఏర్పాటు వంటి పథకాల కారణంగా గడచిన యాభై సంవత్సరాలలో నిర్వాసితులైన వారి సంఖ్య ఐదు కోట్లని ఆ సర్వే లెక్కకట్టింది. ఈ నిర్వాసితులలో మూడో వంతు మందికి మాత్రమే సక్రమంగా పునరావాసం కల్పించినట్టు ఇంకొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ చేసినది తప్పిదమే. దేశాభివృద్ధి కోసం త్యాగాలు చేయమని పేదలకే ఎం దుకు ఉద్బోధించాలి? అలాంటి త్యాగాలు చేయవలసిం దని ధనికులను ఎందుకు అడగకూడదు?
అభివృద్ధి కోసం రైతులనూ, గిరిజనులనూ, పేదల నూ వారు నివశించే ప్రదేశం నుంచి వేరే చోటుకి తరలిం చే ప్రక్రియ సమర్థనీయమేనని చెప్పుకోవడానికి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు చేసిన కొన్ని ఉపన్యాసా లను ఉపయోగించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం యోచి స్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. భూసేకరణ బిల్లు వివా దాస్పదమై, తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఇలాంటి ఆలోచనకు వచ్చిందన్నదే ఆ వార్తల సారాంశం.
త్యాగం బాధ్యత పేదలదేనా?
దేశం స్వాతంత్య్రం సాధించుకున్న కొత్తలో, అంటే 1948 లో, మహానది మీద నిర్మించ తలపెట్టిన హిరాకుడ్ ప్రాజె క్టుకు ప్రథమ ప్రధాని శంకుస్థాపన చేశారు. ఆ సంద ర్భంగా ప్రసంగిస్తూనే జవహర్‌లాల్, ‘మీరు బాధపడ వలసి వస్తే కనుక, దేశ ప్రయోజనం కోసమే ఆ పని చేయండి!’ అన్నారు.
దీనికి నేను అంగీకరించను. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసే బాధ్యత ఎప్పుడూ పేదవర్గాల మీదే ఎందుకు ఉండాలి? దేశాభివృద్ధిలో మధ్య తరగతి చేసిన త్యాగం గురించిన మాటను ఆఖరిసారిగా మనం ఎప్పు డు విన్నాం? అలాగే దేశ ఆర్ధికాభివృద్ధికి ధనికవర్గం త్యాగం చేసిందన్న మాటను ఎప్పుడు విన్నాం? అంటే, పేద ప్రజలు నిరంతరం త్యాగాలు చేస్తూ ఉంటే, ఎలాం టి సంకోచాలు పెట్టుకోకుండా, ఆ లక్షలాది పేదల ఉపా ధికి ఉన్న భద్రతను భగ్నం చేస్తూ ధనికవర్గం దాని ఫలా లను అనుభవించాలని దాని అర్థం కాదా? తమకు న్యాయంగా రావలసిన ప్రయోజనాలు సిద్ధించకుండానే, వాటి కోసం పోరాడే క్రమంలోనే నిర్వాసితులలో కొన్ని తరాలు అంతరించిపోయాయి.
1948లో హిరాకుడ్ డ్యామ్ కోసం నిర్వాసితులైన వాళ్లు స్వతంత్ర భారతంలో 68 ఏళ్ల తరువాత కూడా పునరావాసం పొందలేక, నిరాశోపహతులై మిగిలిన దృశ్యాన్ని బహుశా నెహ్రూ ఊహించి ఉండరు. కొన్ని సర్వేల ప్రకారం ఏవేవో ప్రాజెక్టుల కోసం నిర్వాసితులై, వేరేచోట ఉంటున్నవారు, మరో పురోభివృద్ధి పథకం కోసం రెండోసారి కూడా నిర్వాసితులయ్యారు. ఆధునిక జలవనరుల మహా పథకాలను నెహ్రూ ‘ఆధునిక దేవా లయాలు’ అని పేర్కొనేవారు. కానీ భాక్రా డ్యామ్, తెహ్రీ డ్యామ్, పాంగ్ డ్యామ్ కోసం నిర్వాసితులైన వారిలో చాలా మంది ఇప్పటికీ పునరావాసానికి నోచుకోలేకపో యారు. పెద్ద పెద్ద నీటి ప్రాజెక్టులకీ, భారీ పరిశ్రమల నిర్మాణానికీ నేను వ్యతిరేకం కాదు. కానీ తమ తమ నెల వుల నుంచి బలవంతంగా నెట్టివేసిన వారి దుస్థితి పట్ల, వారు పడుతున్న కడగండ్ల పట్ల రాజ్యం, సమాజం మౌన ప్రేక్షకపాత్రకు ఎలా పరిమితం కాగలుగుతున్నాయి? ప్రాధాన్యం మేరకు వారికి పరిహారం, పునరావాస సౌక ర్యం ఎందుకు కల్పించరు?
దేశంలో ఐదుకోట్ల నిర్వాసితులు
రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2011 సంవత్సరంలో ఒక సర్వే నిర్వహించింది. డ్యామ్‌లు, గనుల తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు, వన్య ప్రాణి సంరక్షణా కేంద్రాల నిర్మాణం, జాతీయ పార్కుల ఏర్పాటు వంటి పథకాల కారణంగా గడచిన యాభై ఏళ్లలో నిర్వాసితులైన వారి సంఖ్య ఐదు కోట్లని ఆ సర్వే లెక్కకట్టింది. ఈ నిర్వాసితులలో మూడో వంతు మందికి మాత్రమే సక్రమంగా పునరావాసం కల్పించినట్టు ఇం కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
డ్యామ్‌లూ, పారిశ్రామిక ప్రాంగణాలతోనే కాదు; రైల్వే మార్గాలు, రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం, విద్యుదీకరణ వంటి పనుల వల్ల కూడా రైతులు తమ భూముల నుంచి వేరు పడవలసివస్తున్నది. నిర్వాసితుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని యూనా జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భారతీయ రైల్వేలు రైతులకు ఇవ్వవలసిన బకాయిలను కక్కించడానికి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును అటాచ్ మెంట్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఎప్పుడో 1998లో సేకరించిన భూములకు సంబంధించిన నష్టపరిహారం కేసులో ఆ న్యాయమూర్తి ఇటీవలనే అలాంటి ఆదేశాలు ఇవ్వవలసివచ్చింది.
ఇలాంటి ఉదాహరణలు దేశం నలు మూలలా ఎన్నో కనిపిస్తాయి. అవన్నీ పేదప్రజలకు చట్ట బద్ధంగా అందవలసిన పరిహారం చెల్లింపులో, నష్టాలను భర్తీచేయడంలో కనిపించే అలసత్వానికి నిదర్శనాలే.
దేశ ఆర్థికవృద్ధి ప్రస్థానంలో రైతులే పెద్ద ఆటం కంగా మారిపోయారంటూ మీడియాలలో కథనాలు వెలువడుతుంటాయి. కానీ విశాలంగా విస్తరించి ఉండే పెద్ద పెద్ద గోల్ఫ్ క్రీడామైదానాల నుంచి సెంటు భూమిని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రభుత్వానికి ధైర్యం లేదు. ఒకవేళ స్వాధీనం చేసుకోవడానికి సర్కారు తెగించి ముందుకు వెళితే, వెనక్కి తగ్గేదాకా ధనికులు ఎలాంటి ఒత్తిడి తీసుకువస్తారో చూడొచ్చు. ఆర్థిక కార్యకలాపా లలో ప్రభుత్వం సమతుల్యత సాధించడానికి దోహదం చేసే విధంగా, సంవత్సరంలో పొందే కరువు భత్యంలో ఒక కిస్తీని వదులుకోమని ఉద్యోగులను అడగండి! వాళ్లు వెంటనే మూకుమ్మడి నిరసనకు దిగడం చూస్తాం. దేశా నికి పెట్టుబడులు అవసరమైన ఈ సందర్భంలో, విదేశీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఏడో వేతన సంఘం నివేదిక సిఫారసును వదులుకోమని ఉద్యోగులను కోరడం సాధ్యమవుతుందా? అలా కోర డం ఎందుకు సాధ్యం కాదు?!
రాయితీలు అడగొద్దని చెప్పలేమా?
దేశంలో కార్పొరేట్ రంగానికి పన్ను మినహాయింపుల పేరుతో కొండంత రాయితీ కల్పిస్తున్నాం. ఇలా 2004- 2005లో ధారపోసిన రాయితీ రూ. 42 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధి పనులకూ, రైతులకు చేయూతనివ్వడా నికీ పన్నులు చెల్లించమని(మినహాయింపులు కోరవద్దని కూడా) భారతదేశం కార్పొరేట్ రంగాన్ని ఎందుకు అడగ లేకపోతోందోనని అప్పుడప్పుడూ నాకు ఆశ్చర్యం కలు గుతూ ఉంటుంది. దేశాభివృద్ధి కోసం త్యాగం చేయడం ధనికుల, బాగా స్థిరపడిన వారి బాధ్యత కాదా? ఆఖరికి ఈ ఆర్థిక సంవత్సరంలో మినహాయించిన రూ. 5.9 లక్షల కోట్లను చెల్లించమనైనా కార్పొరేట్ రంగాన్ని అడగ వచ్చు. దీనితో మనను కలతకు గురి చేస్తున్న రూ. 5.25 లక్షల కోట్ల ఆర్థిక లోటునైనా భర్తీ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్నే తరువాత దేశాభివృద్ధికి ఉపయోగించవచ్చు.
(దేవీందర్‌శర్మ, వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు ఈమెయిల్: hunger55@gmail.com)