
‘పిట్టల పోరు’లో ‘బ్రిజేశ్’ పిల్లి!
విశ్లేషణ: ‘విభజన’ రొచ్చులో కూరుకుపోయినందున, బ్రజేష్ ట్రిబ్యునల్ కూడా మన రాష్ట్రానికి నదీ జలాల కేటాయింపులలో శ్రద్ధ చూపలేదు. నాలుగేళ్ల సంక్షోభం కారణంగా రాష్ట్ర పాలకులు రెండవ ట్రిబ్యునల్ ముందు వాదించాల్సిన న్యాయవాదులనూ, సేద్యపు నీటి అధికారులనూ తరుచూ మార్చేస్తూ ఉండటం వల్ల కూడా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటూ వచ్చాయి.
‘‘నీటి వనరులను, ముఖ్యం గా నదీజలాలను అభివృద్ధి చేసు కోవడం మీదనే దేశ ఆర్థికాభ్యు న్నతి ఆధారపడి ఉంటుంది. ఇం డియా లాంటి దేశంలో వర్షపా తం అన్ని చోట్లా తగినంతగా ఉండదు. ఉన్నా, నమ్మి ఉండ లేని పరిస్థితి. కనుక దేశంలో వ్యావసాయిక, పారిశ్రామిక అభి వృద్ధి కోసం నదీజలాలను పుష్కలంగా వినియోగించు కోవాల్సిన అవసరం ఉంది. దేశంలోని ప్రధాన నదులన్నీ అంతర్రాష్ట్ర నదులే. అందువల్ల అవి రాష్ట్రాల మధ్య రాజ కీయ సరిహద్దుల్ని అధిగమించి మరీ ప్రవహిస్తుంటాయి’’
- ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఇన్ ఇండియా’’: ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్ ప్రచురణ (1971)
ఇటీవల కాలంలో తెలుగుజాతిని రాజకీయ ప్రయోజ నాల కోసం చీల్చే కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ‘అన్నపూర్ణ’, ‘ధాన్యాగారాలలో ఒకటి’ అన్న పేర్లను, చేకూరుతున్న ప్రయోజనాలను పాలకులూ, పక్షాలూ దెబ్బతీస్తూ వచ్చాయి. చచ్చువో, పుచ్చువో 1969 నాటి మొదటి బచావత్ (కృష్ణా జలవివాదాల పరిష్కారం కోసం) ట్రిబ్యునల్, ఆ తరువాత అదే జలరాశి వినియో గంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి 2010 డిసెంబర్‌లో ఏర్పడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కొన్ని సిఫారసులు చేశాయి.
ఈ సిఫారసులు, ఇచ్చిన తీర్పులలో కొన్ని లోపాలు ఉండ వచ్చుగాని, పూర్తిగా వాటిని తోసి వేయలేము. ఎందు కంటే, మన రాష్ట్రానికి ఎగువన ఉన్న రాష్ట్రాల ప్రయోజనా లను గౌరవించటంతో పాటు మన లాంటి దిగువన ఉన్న రాష్ట్రాల నీటి అవసరాలను గుర్తించి గౌరవించాలని కూడా ఆ ట్రిబ్యునల్స్ చెప్పకపోలేదు. కాని, అదే సమయంలో ఫలానా వ్యవధిలోగా కృష్ణా జలరాశిలోని మిగులు జలా లను కర్ణాటక, మహారాష్ర్టలకు దిగువన ఉన్న రాష్ట్రం (ఆం ధ్రప్రదేశ్) ఒక హక్కుగా కాకుండా వినియోగపు విలువ ప్రకారం, ఆ జలరాశి వృథాగా సముద్రం పాలుకాకుండా వాడుకోవచ్చునని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అంటే 2001వ సంవత్సరంలో కాలపరిమితి ముగిసిపో యిన బచావత్ ట్రిబ్యునల్, ఆ పరిమితికి ముందే ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరం చెప్పలేదు.
అలుసైన ఆంధ్రులు
కర్ణాటక ఆల్మట్టి గేట్ల ఎత్తును పెంచుకుంటూ పోతున్నప్పు డు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 1956 నాటి కేంద్ర జల వ్యవస్థ నియంత్రణ కమిషన్ చట్టం ప్రకారం ఏర్పడిన బచావత్ ట్రిబ్యునల్ సిఫారసుల ప్రకారం కృష్ణా నదిలోని 2173 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) ‘నికర జలా ల’ను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాష్ట్రాల పరీ వాహక ప్రాంతాల అవసరాలను బట్టి పంపిణీ జరగాలని చెబుతూ, ఆల్మట్టిడ్యామ్ ఎత్తును 524025 మీటర్లకే సుప్రీం నియంత్రించాల్సివచ్చింది! కాని ఆంధ్రప్రదేశ్‌కు జలరాశిలో దక్కవలసినంత వాటా అందుబాటులోకి రాక పోవడానికి కారణం ఏమిటి? అప్పుడప్పుడు పాలకుల, కొందరు విపక్ష నేతల రాజకీయ ప్రయోజనాలు, రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక పక్షాలు బిళ్లబాటుగా అర్థాంతరంగా ప్రజలపై రుద్దిన తెలుగు జాతి విభజన సమస్య వల్ల ఏర్పడిన రాజకీయ అనిశ్చితి కారణాలు.
పాలకులూ, ప్రతి పక్షాలూ ‘విభజన’ రొచ్చులో కూరుకుపోయినందున, బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా మన రాష్ట్రానికి నదీజలాల కేటా యింపులలో శ్రద్ధ చూపలేదు. నాలుగేళ్ల సంక్షోభం కార ణంగా రాష్ట్ర పాలకులు రెండవ ట్రిబ్యునల్ ముందు వాదించాల్సిన న్యాయవాదులనూ, సేద్యపు నీటి అధికా రులనూ తరుచూ మార్చేస్తూ ఉండటం వల్ల రాష్ట్ర ప్రయో జనాలు దెబ్బతింటూ వచ్చాయి. ఫలితంగా ‘పిట్టపోరు ,పిట్టపోరు పిల్లి’- ‘బ్రిజేశ్ పిల్లి’ పద్ధతిలో తీర్చినట్టయింది!
రెండు ట్రిబ్యునళ్ల లెక్కలు
జలరాశి పంపకం విషయంలో కూడా ఈ ట్రిబ్యునల్స్ కొన్ని సంవత్సరాల మీదట ‘జల సంవత్సరం’ (వాటర్ ఇయర్)లో సగటున ఏటా ఎంత టీఎంసీ నీరు లభ్యమవు తుందో కట్టే లెక్కలు కూడా ఊహాజనితంగా తయారు కావటంతో కొన్ని సమస్యలు తలెత్తుతూవచ్చాయి. ఒక ట్రిబ్యునల్ (బచావత్) మూడు రాష్ట్రాలకు పంచగల నికర జలరాశిని ఉజ్జాయింపుగా నదిలో నమ్మకమైన నీటి లభ్య తను (డిపెండబిలిటీ) 75 శాతమని గణించుకుని దాని ఆధారంగా 2060 టీఎంసీని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో మన రాష్ట్రానికి 1973లో పంపకం చేసిన మొత్తం 800 టీఎంసీ కాగా, తాజాగా బ్రిజేశ్ ట్రిబ్యు నల్ ఆ మొత్తం వాటాను మనకు అదనంగా మరో 301 టీఎంసీగా, అంటే మొత్తం 1001 (800+301) టీఎంసీగా నిర్ణయించింది. కాగా, బ్రిజేశ్ ట్రిబ్యునల్ విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా జలరాశి నమ్మకంగా ఉండగ లదని (డిపెండబిలిటీ) 47 సంవత్సరాల రికార్డును గణన లోకి తీసుకుని అంచనా వేసింది, 65 శాతం! అంటే బచా వత్ అంచనాకు, బ్రిజేశ్ అంచనాకు ‘నమ్మకంగా చేరగల జలరాశి’ 10 శాతం తేడా ఉంది.
బ్రిజేశ్‌దీ ఉజ్జాయింపు శాతమే! ఏడాదిలో మూడు రాష్ట్రాల మధ్య కేటాయిం పులకు వీలైన మొత్తం సగటు నీరు 2578 టీఎంసీలని లెక్క గట్టి, మళ్లీ ఆ ఉజ్జాయింపులో 16 శాతం జలరాశిని కిందికి సముద్రంలోకి వృథాగా పోయే నీరుగా మినహాయిం చింది! ఈ సందర్భంగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేసిన ఒక వ్యాఖ్య గమనించదగింది. ‘సముద్రంలోకి వెళ్లి కలిసే తగి నంత నీటిని వెళ్లనివ్వకుండా మొత్తం నీటిని వినియో గంలోకి తెస్తే ఉప్పురుకి పోయిన నీరు వ్యవసాయ క్షేత్రా లకే కాదు, మనుషులకు, పశువులకూ కూడా పనికిరాదు. అందుకనే నదీలోయలో ఆ ఉప్పురికిన నీరు పేరుకుపో కూడదు’. అంతేగాదు, ఉప్పు ఎగుమతుల అవసరాలను, పర్యావరణ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇం తకుముందు బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయిం పుల పరిధిని దాటి అదనంగా నీటి కేటాయింపులు సాధ్య పడదని బ్రిజేశ్ ట్రిబ్యునల్ తాజాగా స్పష్టం చేసింది! మరి ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలు తీరాలంటే ఏం చేయాలట? గోదావరి నది లాంటి పక్క పక్కనే ఉన్న నదు ల నుంచి, కర్ణాటకలో పశ్చిమంగా పారే నదుల నుంచి నీటిని ఎరువు తెచ్చుకొనక తప్పదని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ‘చావు కబురు చల్లగా’ వదులుతోంది!
ఇక్కడే ఉన్నాయి చట్టాలు
సహజ నదీ జలరాశిలో రాష్ట్రాల హక్కులను ఎలా కాపాడు కోవాలో గత 140 సంవత్సరాలుగా మన దేశంలో అమలు లో ఉన్న సేద్యపు నీటి (ఇరిగేషన్) చట్టాలు నిర్దేశిస్తు న్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంతపు ఇరిగేషన్ చట్టాలు), మద్రాసు హైకోర్టు తీర్పులూ వగైరా ఎన్నో ఉన్నాయి. దాదాపు ఈ చట్టాలన్నీ రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల లోపలా ఎగువనున్న ప్రాంతాలు దిగువనున్న ప్రాంతాల (పరీవాహక ప్రాంతాల) అవసరాలకు సమ ప్రాతిపదికపైన జలాల వినియోగాన్ని అనుమతించాల్సిం దేనని స్పష్టం చేస్తున్నాయి. అయితే కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర పాలకులు కొందరు కొన్నాళ్లుగా తమకు దిగు వన ఉన్న ఆంధ్రప్రదేశ్ అవసరాలకు సహజ సూత్రాలకు, సహజ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ‘విభజన’తో ఆజ్యం పోస్తున్నవారు తెలుగు జాతి లోని ‘గుప్పెడు’ వేర్పాటువాదులు. ‘సందట్లో సడేమి యా’ల విద్రోహాన్ని ఆసరా చేసుకుని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జలా లను నియంత్రిస్తూ చడీచప్పుడు లేకుండా ‘బాబ్లీ’ గేట్లు పెంచేసి కట్టేసుకుంది. మనలోని వేర్పాటువాదులు మాసా ల తరబడి గుడ్లప్పగించి కూర్చున్నారే తప్ప దీనిని పసి కట్టలేక పోయారు (ఈ రచయిత, అతని వార్తా సిబ్బందీ మేల్కొని ‘ఇక బాబ్లీ కథ ముగిసింద’ని పతాక శీర్షికలో హెచ్చరించే దాకా రాజకీయ పక్షాల నాయకులంతా కుంభకర్ణుడి నిద్ర లోనే జోగుతూ వచ్చారు).
దిగువ రాష్ట్రాలకే ఓటు
మన దేశీయ చట్టాలే కాదు, అంతర్జాతీయ జల వివాదాలు సహితం దిగువన ఉన్న దేశాలకే, రాష్ట్రాలకే జలరాశి పంపి ణీలు, కేటాయింపులో ప్రాధాన్యం కల్పించాయని మరవ రాదు. మన దేశంలో కూడా నదీ జలాల తగాదాలకు న్యా యస్థానాలను ఆశ్రయించి లాభంలేదు. ఫెడరల్ వ్యవస్థలో ఈ సమస్యకు పరిష్కారం నిపుణులతో కూడిన కేంద్రీయ జలపంపిణీ వ్యవస్థతోనే సాధ్యం. ప్రాంతీయ తగాదాలకు ముగుదాడు కూడా అదే కావాలి. కృష్ణ-గోదావరి, నర్మద సహా దేశంలోని జలవివాదాలన్నింటికీ కారణం- ప్రజా హిత పరిపాలనా వ్యవస్థ ఇంకా అవతరించకపోవడమే. ట్రిబ్యునళ్లు సంబంధిత రాష్ట్రాల వాస్తవావసరాలను పూర్తి గా గణించలేవు. ఇందుకు ఉదాహరణలు - కావేరీ జలాల వివాదంలో తమిళనాడుతోనూ, కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్‌తోనూ పేచీలకు దిగిన కర్ణాటక నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు బాహాటంగా ప్రకటిం చడమే! చివరికి చరిత్రగల తెలుగువాడి పనితీరు - ‘పిఠాపురం వెళ్లి పిడితెడు నీళ్లు తెచ్చినట్టయింది!!
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు