'స్మార్ట్' ప్రజాస్వామ్యం జైత్రయాత్ర
మొబైల్ వీడియో రాజకీయవేత్తల కాళ్ల కింద భూలోక నరకాగ్ని జ్వాలలను రాజేస్తుంది. స్మార్ట్‌గా మారినది ఫోన్ ఒక్కటే కాదు... ఓటర్లు కూడాను. స్మార్ట్ ఓటర్ లేనిదే స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనమేముంది? ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి నుంచి తాము ఏం వినాలనుకుంటున్నామో చెప్పగల కళ ఓటర్లకున్నప్పుడు... అదే నిజాన్ని ఓటింగ్ మిషన్ ద్వారా చెప్పడం చాలా సులువు. ఎవరి ఆగ్రహానికో గురయ్యే ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కోవాలి?
మొబైల్ ఫోన్ ఎన్ని ఎన్నికలను చూసి ఉంటుంది? దాదాపు దశాబ్ది క్రితమే కారుచౌక కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లు అసాధారణమైన రీతిలో వ్యక్తిగత సమాచార సంబంధాలు జగమంతటికీ విస్తరించాయి. ఈ విస్తరణతోపాటే అది ఒక స్వతంత్ర శక్తిగా ఆవిర్భవించింది. అయితే, స్మార్ట్ ఫోన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాకనే ప్రజాస్వామిక చర్చ లో గణనీయ స్థాయి జోక్యం చేసుకోగలిగే శక్తి దానికి సంక్రమించింది. వీడియో కెమెరా దాన్ని అత్యంత శక్తివంతమైన సాధనంగా మార్చింది.
'సెల్ఫీ' (స్వీయ చిత్రం), మొబైల్ ఫోన్ కెమెరాకు సంబంధించిన అత్యంత ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన అంశం. కుటుంబ అను బంధాలను లేదా స్నేహానుభూతులను శక్తివంతంగా ప్రసారం చేయడం ద్వారా అది కొద్ది కాలంపాటే అయినా దూరాన్ని మటుమా యం చేయగలిగింది. వీడియో ఆ ఆనందాన్ని మరింత ఇనుమడిం పజేసింది. ఇక మొబైల్ వీడియో, ప్రజా నిఘా ఆయుధంగా విరుచు కుపడటానికి ఆ తర్వాత ఎంతో కాలం పట్టలేదు. సాంకేతికత ప్రజాస్వా మ్యాన్ని పునరావిష్కరించడంతో 'డెమ్‌టెక్'(ప్రజాస్వామ్య సాంకేతికత) విప్లవం సంభవించింది.
అలాంటి ప్రతి పరిణామానికి ఒక పేరు అవసరం. ప్రజాస్వామ్యంపై సాంకేతికత ప్రభావానికి తగిన పేరు 'డెమ్‌టెక్'అనే అనిపిస్తోంది. ఆ పదం ప్రాచుర్యంలోకి వస్తుందని నేను సహజంగానే ఆశిస్తున్నాను. అయితే, నిశ్చల స్వీయ చిత్రమైన సెల్ఫీకంటే విభిన్నమైన వీడియో రికార్డింగ్‌ను ఏమనడం సముచితం? 'హెల్ఫీ'అంటే ఎలా ఉంటుంది? 'హెల్‌ఫైర్'(నరకాగ్ని) అనే పదంతో హెల్ఫీకి ఉన్న సన్నిహిత ధ్వన్యానుబంధ ప్రభావం కూడా కలుగు తుంది. మొబైల్ వీడి యో రాజకీయవేత్తల కాళ్ల కింద భూలోక నరకాగ్ని జ్వాలలను రాజేస్తుంది.
24 గంటలూ కెమెరా చూపులో జీవించడమంటే ఏమిటో మన పార్టీలన్నిటి రాజకీయవేత్తలకూ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు సాగుతున్న బిహార్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఏ మాత్రం ఆలోచనా లేకుండా తమ వాహనాల దండుతో వేగంగా దూసుకుపోతూ, పౌరులను దురుసుగా పక్కకు నెట్టేయడం కనబడుతోంది. వారు దాన్ని వీడియో కెమెరాల్లో రికార్డ్ చేసి తక్షణమే అందుకు ప్రతీకారం తీర్చుకోవడం చూశాను. ఈ ప్రతీకారం ఇప్పటికైతే పార్టీలకు అతీతంగా తటస్థంగానే ఉన్నా, పోలింగ్ రోజున తప్పక అంతో ఇంతో ప్రభావం చూపుతుంది. రాజకీయవేత్తల ఈ అమాయకత్వం-ఇది అత్యంత దయతో ఉపయో గిస్తున్న పదం- అగమ్యగోచరమైన భవితను వెతుక్కుంటున్న అనామక అభ్యర్థులకే పరిమితం కాలేదు. నేతలకు సైతం ఈ విషయం అర్థం కావడం లేదు.
బిహార్ శాసనసభ ఎన్నికల్లో అసాధారణమైనదేదీ జరగకపోవడమే అసాధారణం అవుతుంది. లాలూప్రసాద్ యాదవ్ వంటి వారు ఈ ఎన్నికల చర్చలో, నడవడికలో నాటకీయమైన ప్రమాణాలను నెలకొల్పారు. వాటినే కొలమానంగా తీసుకుని చూసినా... గందరగోళ పడిపోతున్న నితీశ్ కుమా ర్‌ను ఒక తాంత్రిక బాబా ముద్దు పెట్టుకోడాన్ని వీడియోలో చూడటం... వెర్రి విపరీత స్థాయికి చేరిందనిపించేలా చేస్తుంది. వివేకంగల నాయకుడైన నితీశ్ ఆ తాంత్రికుడి జిత్తులకు పడలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల ఘోర పరా జయం నుంచి నితీశ్ ఇంకా కోలుకోక ముందు, ఆ ఏడాది మధ్యలో తీసిన వీడియో అది. ఆ సమయంలో తిరిగి మానసిక స్థయిర్యాన్ని సమకూర్చు కోవడం ఆయనకు అవసరమై ఉంటుంది. అందుకు క్షుద్ర తాంత్రికుడైన ఆ వ్యక్తితో సంబంధాలు పెట్టుకోడానికి సైతం సిద్ధపడి ఉంటారు. అయినాగానీ ఆయన చేసిన దానిలో కొంత అనుమానాస్పద మైనది ఉందనడం సమంజసమే.
ఉన్నది ఉన్నట్టుగా విప్పి చెప్పే కె మెరా తనకు సమీపంలోనే ఉన్నదని, అది తనను రికార్డు చేస్తోందని నితీశ్‌కు ఎంత మాత్రమూ తెలియదు. తన రాజకీయ జీవితం ధ్వంసమై, శకలాలుగా పడి ఉన్న ఆ సమయంలో ఆయన తనకు మంచి భవిష్యత్తు ఉందని జోస్యం చెప్పేవారెవరైనా దొరుకుతారే మోనని వ్యక్తిగతంగానో లేదా రహస్యంగానో ఎవరినో ఒకర్ని కలుసుకోడానికి వెళ్లి ఉంటారు. పర్యవసానం? ఆ గదిలో ఉన్నవారంతా నితీశ్ కుమార్‌కు నమ్మకస్తులేనని చెప్పనవసరం లేదు. అయినా వారిలోని ఒక వ్యక్తి ఆయన విశ్వాసాన్ని వమ్ముచేశారు.
ఈ ఉదంతం, ఈ హెల్ఫీ భీతి రుగత్మకు సంబంధించిన అనుమానాస్పద అంశాన్ని విశదం చేస్తుంది. విశ్వాసం, ప్రలోభాన్ని మించిన పెద్ద బలహీనతని స్పష్టమౌతుంది. రాజకీయాల్లో విశ్వాసం ఎప్పుడూ అధిక మూల్యం చెల్లించా ల్సినదిగానే ఉంటుంది. ఎంతైనా రాజకీయాల చరిత్రంతా విద్రోహాలతో నిండినదే కదా. అందుకు సమకాలీన ఆధారాలకు సైతం కొదవ లేదు. లీకిచ్చిన ఏ కథనం ద్వారానో మాటలపరమైన ద్రోహం జరిగితే, అది పచ్చి అబద్ధమనో లేదా దాన్ని ఖండించో దానివల్ల కలిగే నష్టాన్ని మీరు పరిమితం చేసుకోవచ్చు. కానీ కెమెరా బయటపెట్టే విషయాలను మీరెలా కాదనగలరు? మొబైల్ ఫోన్లు విస్ఫోటనాలను సృష్టించగల సాధనాలు కాగలవు. అందుకే వీఐపీల కార్యాలయాలు చాలా వాటిలో మొబైల్ ఫోన్లపై ఆంక్షలున్నాయి. వీఐపీలు తమ సంభాషణలను సురక్షితంగా చేసుకోవాలని ఈ ఆంక్షలను మరింతగా విస్తరింపజేస్తారు కూడా.
ప్రజాస్వామ్యం ఎన్నటికీ అతి సులువైన వ్యవహారంగా మారదు. అదే అందులోని ఉత్తేజకరమైన వాస్తవం. స్మార్ట్(తెలివైనది)గా మారినది ఫోన్ ఒక్కటే కాదు, ఓటర్లు కూడా అలాగే మారారు. నిజమే, స్మార్ట్ ఓటరు లేనిదే స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనమేముంది? ఉదాహరణకు, ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థి నుంచి తాము ఏం వినాలనుకుం టున్నామో చెప్పగల కళ ఓటర్లకున్నప్పుడు... అదే నిజాన్ని ఓటింగ్ మిషన్ ద్వారా చెప్పడం చాలా సులువవుతుంది. అలాంటప్పుడు ఎవరి ఆగ్రహానికో గురయ్యే ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కోవాలి?
'విల్-ఓ'ద-విస్ప్'(వాతావరణ సంబంధ భ్రమాత్మకమైన వెలుగు 'దయ్యపు దీపం') అనే పదబంధానికి కాలదోషం పట్టిపోయింది. ఇంగ్లండు లో ఎక్కువ భాగం ఇంకా చిత్తడి నేలలతోనే నిండి ఉన్న కాలానికి చెందిన పదబంధమది. చిత్తడి నేలల మీద తేలియాడే దయ్యపు వెలుతురు లేదా దీపం అని దాని వాచ్యార్థం. అలంకారికంగానైతే పట్టుకోవడం కష్టమైనది లేదా అసాధ్యమైనది అని అర్థం. ఈ దయ్యపు వెలుతురు పట్టించి పీడించేది అభ్యర్థులను మాత్రమే కాదు. మధ్యస్తులుగా జోక్యం చేసుకునేవారి భారీ సేనను కూడా అది ఆవహిస్తుంది. అందుకు విరుగుడు, వ్యక్తిగత విచారణ కంటే సమష్టి వాస్తవికత ప్రాతిపదికపైన అంచనా వేయడమే సురక్షితం కావచ్చని అర్థం. ఒక వ్యక్తితో సాగించే సంభాషణ తరచుగా దుబాసీతో ఘర్షణగా ముగుస్తుంటుంది. కాబట్టి ఎన్నికల సభ మానసిక స్థితిని లేదా ప్రవర్తనను బట్టి అంచనా వేయడం ఉత్తమం.
మనం ఇంకా మొబైల్ ఫోన్ శక్తిసామర్థ్యాల సరిహద్దునే ఉన్నాం. అయినా అదే రాజకీయవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. నేడు దానికున్న సామర్థ్యమే గందరగోళం రేకెత్తిస్తోందంటే, ఈ వినోదం ఇప్పుడే ప్రారం భమైందని మాత్రమే అర్థం.
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి