‘విశ్వసనీయత’ ఎలా? | Trust on Communist parties deteriorating? | Sakshi
Sakshi News home page

‘విశ్వసనీయత’ ఎలా?

Published Sat, Aug 20 2016 1:21 AM | Last Updated on Fri, May 25 2018 2:48 PM

‘విశ్వసనీయత’ ఎలా? - Sakshi

‘విశ్వసనీయత’ ఎలా?

విశ్లేషణ
వర్గేతర సామాజిక దోపీడీకి గురయ్యేవారి ప్రయోజనాలను ప్రతిబింబించే స్వభావాన్ని కమ్యూనిస్టు పార్టీలు  కోల్పోయాయనే భావన ఆయా సామాజిక బందాలలో బలపడింది. దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసులు సహా అణగారిన ప్రజలందరి విశ్వాసాన్ని అవి చూరగొనాలి.

కమ్యూనిస్టు ఉద్యమం ఎందుకింతగా బలహీన పడిపోయింది? అని ఆవేదన చెందుతున్న కమ్యూనిస్టు శ్రేయోభిలాషులు ఎంతో మంది ఉన్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు ఉద్యమం పునరుజ్జీవితమైతే తప్ప ఏ మాత్ర మైనా శ్రామికులకు మేలు జరగదని ఆశతో ఎదురు చూసే వారూ, అందుకోసం కషి చేస్తున్నవారూ లేకపోలేదు. అంతకుమించి ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు అందు కోసం తీవ్ర మేధోమధనం జరుపుతున్నారు. ఈ అంశాన్ని పరిశీలించే ముందు మన స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ప్రధాన అంశం గూర్చి ఆలోచించక తప్పదు. మన జాతీయోద్యమం అంటారే గాని, అది వివిధ జాతుల జాతీయోద్యమం అనడం çసబబు. నాటికి దేశంలో గుర్తింపును పొందిన 17–18 జాతుల ప్రజలంతా.. బ్రిటిష్‌ పాలన విరగడై స్వతంత్రం వస్తే తమ తమ జాతుల ఆర్థిక, సామాజిక, సాంస్కతిక జీవనం వద్ధి చెందగలుగు తుందని ఆశించారు. వివిధ జాతుల స్వచ్ఛంద సమాఖ్యగా మన భారతదేశం వర్ధిల్లుతుందని వారు భావించారు. ఈ దష్టి తోటే వివిధ జాతుల ప్రజానీకం, నేతలు స్థానికంగా ఎక్కడికక్కడ పోరా డుతూ మొత్తంగా దేశవ్యాపిత ఉద్యమంలో స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములయ్యారు. అంతే కానీ, ఏ ఒక్క జాతి ప్రజల ఉద్యమ ఫలితమో కాదు మన స్వాతంత్య్ర పోరాట విజయం! భారత జాతి అన్నది స్వాతంత్య్రోద్యమ భావోద్వేగంలో ఏర్పడిన భావనే గానీ... వాస్తవానికి అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, ద్రవిడ, పంజాబీ, బెలూచీ ఇత్యాది జాతులు లేని ప్రత్యేక భారత జాతి లేదు. ఈ వాస్తవాన్ని పరిగణించి కమ్యూనిస్టు పార్టీలు దేశవ్యాప్త జాతీయ ఉద్యమాలతో పాటూ ఆయా జాతుల జాతీయ సమస్యలకు కూడా తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి.


రెండు, మన స్వాతంత్య్రోద్యమం కేవలం బ్రిటిష్‌ వలస పాలన నుంచి విముక్తి కోసం ఒక్క రాజకీయ ఉద్యమంగానే సాగలేదు. వివిధ దశలలో – బాధ్యతాయుత పాలన కోసం అనే స్థాయి నుంచి సంపూర్ణ స్వాతంత్య్ర స్థాయికి ఎదుగుతూ వచ్చింది. 1930లకు గానీ కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో స్థూలంగా ఒక స్థాయి పార్టీగా ఏర్పడలేదు. స్వాతంత్య్రోద్యమంలో స్వాతంత్య్ర సాధన రాజకీయ అంశమే ప్రధానంగా ఉండినా, అందులో సామాజిక న్యాయం, ఉత్తమ నైతిక సాంస్కతిక కర్తవ్యాలకు గూడా తగిన ప్రాధాన్యం ఉండేది. ఉదాహరణకు, ‘కల్లు మానండోయ్‌ బాబూ కళ్లు తెరవండోయ్‌’ అంటూ సాగిన కాంగ్రెస్‌ ప్రజా ఉద్యమం ఒక సాధారణ డిమాండును మించిన పోరాటంగా జరిగింది కదా! అలాగే దళిత ఉద్ధరణ, వారి ఆలయ ప్రవేశం, అస్పశ్యతా నివారణ, స్త్రీల పురోభివద్ధి వంటివి మన మెరిగినవే. భారత స్వాతంత్య్ర ఉద్యమం ఒక రాజకీయ పోరాటంగానే గాక బహుముఖ ప్రజాహిత కార్యక్రమాల సమాహారంగా సాగింది. తదుపరి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చినవారిలో నేతలేగాక సామాన్య ప్రజలు కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారే. మన సుందరయ్య, సీనియర్‌ కంభంపాటి, కేరళకు చెందిన నంబూద్రిపాద్‌ వంటి వారు అలా కాంగ్రెస్‌ ఉద్యమం నుంచి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చినవారే. కానీ వారికి వర్గ పోరాటమే ప్రధానమైనది. కాంగ్రెస్‌లో ఆ వర్గ పోరాటం తప్ప ఇతర ప్రజా పోరాటాలన్నీ భాగంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే భారత స్వాతంత్య్ర సముపార్జన ప్రధాన లక్ష్యం వర్గ సామరస్యం. అలాగే సామాజిక, న్యాయ తదితర ప్రజా ఉద్యమాల ఆవశ్య కత ఉన్నా అవి ఒక పరిధి దాటి సమరశీలంగా సాగరాదని కాంగ్రెస్‌ ప్రత్యేకించి గాంధీ, ఆయన అనుయాయుల భావన.


వర్గరహిత సాధారణ ప్రజాపార్టీ కాంగ్రెస్‌ క్రమంగా దోపిడీకి గురవుతున్నవారి వర్గ పోరాటాలను సహించలేనిదిగా దిగజారుతూ పోయింది. కాగా, కమ్యూనిస్టు పార్టీ వర్గపోరాటమే ప్రధానంగా ఇతర సామాజిక, నైతిక తదితర పోరాటాలను నిర్వహించే పార్టీగా రూపొం దుతూ వచ్చింది. ఇక స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్‌ తదితర పాలక పార్టీలు దోపిడీ వర్గ ప్రయోజనాలను రక్షిస్తూనే, ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగా ఇతర సామాజిక, నైతిక అంశాలను కూడా వాడుకుంటూ వస్తున్నాయి. మరోవంక వర్గ పోరాటానికి ప్రాధాన్యం పేరిట కమ్యూనిస్టు పార్టీలు... వర్ణ వివక్ష తదితర సామాజిక వివక్షతకు గురవుతున్న ప్రజల న్యాయమైన పోరాటా లను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. దోపిడీ వర్గాలలో సైతం అధికార దాహంతో విభేదాలు పెరగసాగాయి. మొదటి నుంచీ కాంగ్రెస్‌లోని మితవాద, మతవాద శక్తులు ఆ పార్టీలో ఉన్న కొద్దిపాటి పురోగామి, లౌకిక స్వభావాన్ని అంగీకరించనివిగా మారాయి. చివరకు ఆ శక్తులు, నాటి హిందూ మహాసభ మితవాద, మతతత్వ ఎజెండాతో క్రమ క్రమంగా భారతీయ జనతా పార్టీగా రూపు దాల్చాయి. మరో వైపు అంతర్జాతీయ, జాతీయ విభేదాలు, ఏదో ఒక మేరకు స్వార్థ సంకుచిత ప్రయోజనాలు కలసి కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలు వచ్చాయి. ఇక వర్ణ వివక్ష తదితర వర్గేతర సామాజిక దోపీడీకి గురయ్యే వారి ప్రయోజనాలను ప్రతిబింబించే స్వభావాన్ని అవి కోల్పోయాయనే భావన ఆయా సామాజిక బందాలలో బలపడింది. దీంతో వివిధ సామాజిక, వర్ణ అస్తిత్వ ఉద్యమాలను ప్రతిబింబిస్తూ కుల సంఘాలు అవతరించాయి. కమ్యూనిస్టు పార్టీలలోనే అవకాశవాదం, అధికార దాహం చోటుచేసుకున్నాయని మార్క్సిస్టు పార్టీయే ఆత్మవిమర్శ చేసుకుంది.


కమ్యూనిస్టు ఉద్యమం తిరిగి తన గత వైభవాన్ని సంతరించుకోవా లంటే – తొలితరం కమ్యూనిస్టు పార్టీవలే వర్గపోరాటాలతో పాటూ ఇతర సామాజిక, నైతిక పోరాటాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేక శ్రద్ధా సక్తులతో, కషితో అణగారిన ప్రజలు దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసులు తదితరులందిరి విశ్వాసాన్ని చూరగొనగల రూపును తిరిగి సంతరించుకోవాలి.మొత్తం జాతి ప్రయోజనాలను ప్రతిబింబించే రీతిలో కమ్యూనిస్టులు ఆయా జాతీయ ఉద్యమాలను నిర్మించే కషి చేయాలి. ఉదాహరణకు, కేజీ బేసిన్‌లో సహజ వాయువు కోసం ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న రీతిలో పార్టీలకు అతీతంగా తెలుగు జాతి ఉద్య మానికి రూపాన్ని ఇవ్వగలగాలి! అలాగే ప్రత్యేక హోదా ప్రజల ఆశగా, ఆకాంక్షగా ఉన్నది కాబట్టి అలాంటి ఏపీ కోసం వర్గ, వర్ణ, రాజకీయ విభేదాలను అధిగమించి ఉద్యమించాలి. సాధారణ ప్రజా సమస్యలపై సాగిస్తున్న ఉద్యమాలకు విస్తత రూపం ఇవ్వగలగాలి! ఇందుకు కమ్యూ నిస్టుల మధ్య ఐక్యత కీలకం! కాంగ్రెస్‌తో ఎన్నికలలో కలవాలా, వద్దా? వంటి ఎన్నికల ఎత్తుగడల తాత్కాలికతను దష్టిలో ఉంచుకుని తమ వ్యూహంపై కేంద్రీకరిస్తూ.. తమ దక్పథాన్ని, శ్రేయోభిలాషులను, ప్రజా పునాదిని విస్తరించుకుని గట్టిపరచుకోవాలి. ప్రజాభ్యుదయం కోసం మహ త్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం కష్టసాధ్యమైనా ఇంతటి బహ త్తర కర్తవ్యాన్ని కమ్యూనిస్టులు సాధించగలరని ఆశిస్తున్నాను. -వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు డా‘‘ ఎ.పి. విఠల్‌ ‘ 98480 69720

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement