ఇన్ బాక్స్: తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకి దాదాపు అన్ని చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్‌లు నిండాయి. హైదరా బాద్‌లో దశాబ్దాలుగా నాలాలను ఆక్ర మించి ఇళ్లు కట్టుకోవడంతో జరుగుతున్న ఉత్పాతం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. దీనికి తోడు, నాలాలలో పూడిక సరిగ్గా తీయక నీళ్లు రోడ్లపైకి పారి ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆక్రమణలకు గురైన చోట నాళాలు నీటి ఉధృతికి తట్టుకోక చాలా ప్రాంతాలలో ఇండ్లలోకి అపార్ట్ మెంట్‌లలోకి నీళ్లు వచ్చాయి. నాలాలపై అక్రమంగా ఇండ్లు కట్టుకున్న వారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నది నిజమే కానీ అక్రమ కట్టడాలను, నాలాల పరీవాహక ప్రాంతాలని సరిచేయకపోతే మునుముందు చాలా ప్రమాదకరం.
కిర్లోస్కర్ నివేదిక ప్రకారం నగరంలో 28 వేల నాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజాం పేటలోని బండారి లే అవుట్ సముద్రంగా మారడంతో ప్రజల ఇబ్బందులు అంతాఇంతా కాదు. నాలాలపై అక్రమ కట్టడాలు తొల గించాల్సిందే కాని ఇళ్లు కోల్పో యిన వారికి సరైన ఆవాసం ఏర్ప రిచి ప్రక్షాళన చేస్తేనే రేపటి భారీ వర్షాలను ఎదుర్కొని నిలబడగలం.. కనీ వినీ ఎరుగకుండా దెబ్బతిని పోయిన అనేక ప్రాంతాల్లో మామూలు పరిస్థి తులు వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలి, భారీవర్ష బాధిత కుటుం బాలకి చేయూత నివ్వాలి.
జరుుని రాజేశ్వర్, కాప్రా, హైదరాబాద్
స్వేచ్ఛ, స్వతంత్రం మీకేనా?
నా కోసం ఎదురుచూస్తారని తెలుసు/నేను వస్తే పులకించిపోతారని తెలుసు అందుకే నా రాక ఆలస్యమైనా, కచ్చితంగా వస్తానని తెలుసు/మీరు రమ్మన్నప్పుడు నేను రావడానికి చెరువులు, చెట్లను రక్షించారా!/కాలుష్యాన్ని తగ్గిస్తున్నారా!/పోనీ ఈ మారుతున్న కాలానికి,/నా కోసం ఒక ఇంకుడుగుంతనైనా ఏర్పాటు చేసుకున్నారా! చెప్పండి./నాకు చెన్నై పైన లేదు కోపం/హైదరాబాద్ పైన అంతకంటే లేదు.
ఎప్పుడొస్తానో తెలియదు/వచ్చినప్పుడు ఎంత మేలు చేస్తానో...అందరికీ తెలుసు/అలాగని భూమాత అంత సహనం నాకు లేదు./ మా 5 గురిలోఎవరికి కోపం తెప్పించినా పరవాలేదు కానీ, /భూమాత సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం/మేమంతా ఒక్కటై ముంచెత్తుతాం జాగ్రత్త!/నా రాక కోసం ఎదురు చూస్తారు/మిమ్మల్ని పలకరిద్దామని వచ్చా!/ఆనందిస్తారు!
నష్టం చేసిందం టారు/నష్టాన్ని ఆకాశం నుంచి పరిశీలిస్తారు/విహార యాత్ర చేయడానికి వెళ్ళినట్లు ఉంటుంది /పనులు పేరుకుపోయారుు అంటారు/పేరుకుపోరుున చెత్తను కడిగేశా! నేనంతే!/నా దిశ మారింది../నేను వచ్చి కొన్ని రోజులైనా... అన్నింటినీ/ నిండు కుండల్లా నింపా/ఎంతైనా అనుకున్నట్లు ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ కాలం కదా! కబ్జాల కాలం. అవినీతి కట్టడాల కాలం/ఎక్కడ ఉండమంటారు చెప్పండి. నన్ను స్వేచ్ఛగా ఉండనిచ్చే కాలమా! ఇది/నాకు కూడా స్వేచ్ఛ, స్వతంత్రం కావాలి.
ఇట్లు మీ వాన అలియాస్ వర్షం
- తలారి సుధాకర్, కరీంనగర్
చేతులు కాలాక.. నాలాలు
Published Thu, Sep 29 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement