illegal buildings
-
మా చెరువు తప్పిపోయింది అప్పుడు అలా - ఇప్పుడు ఇలా
-
అక్రమాలపై అస్త్రం
సాక్షి, హైదరాబాద్ : మీ ప్రాంతంలో అక్రమ భవనాలు, లే–అవుట్లు నిర్మిస్తున్నారా? ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదా? భవన నిర్మాణాలు, ఇతరత్రా అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారా? దరఖాస్తు చేసుకున్న వెంటనే చకచకా అనుమతులొచ్చేస్తే బాగుండుననిపిస్తోందా?.. అయితే మీ సమస్యలు త్వరలోనే తీరనున్నాయి. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్–బీపాస్) ద్వారా అక్రమ/అనధికార నిర్మాణాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. అలాగే వివిధ నిర్మాణ అనుమతులు, ఎన్ఓసీల జారీకి ప్రభుత్వం తాజాగా కచ్చితమైన గడువులను నిర్దేశించింది. ఇలా ఫిర్యాదుచేస్తే అలా ఆటకట్టు: అనుమతుల్లేకుండా లేదా అనుమతులు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై, మున్సిపల్ స్థలాలు, చెరువులు, శిఖం భూములు, ప్రైవేట్ స్థలాలను ఆక్రమించి దౌర్జన్యంగా నిర్మాణాలు సాగించడంపై ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా చాలా సందర్భాల్లో అధికారుల నుంచి స్పందన ఉండదు. లేదా అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుని వదిలేస్తుంటారు. ఇకపై అలా చేయడానికి వీలుండదు.https://tsbpass.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని ఎన్ఫోర్స్మెంట్ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే ఫిర్యాదు చేసేందుకు దరఖాస్తు తెరుచుకుంటుంది. అందులో ఫిర్యాదుదారుడి పేరు, ఫోన్ నంబర్, ప్లాట్/సర్వే/డోర్ నంబర్లు, స్థలం యజమాని పేరు, అక్రమ నిర్మాణం ఫొటోతో పాటు కచ్చితమైన లొకేషన్ తెలిపేలా లైవ్ జియో–కోఆర్డినేట్స్‌ను పొందుపరిస్తే సరిపోతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా వచ్చే ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుదారుడికి ఒక నంబర్ ఇస్తారు. దాని ఆధారంగా దరఖాస్తు పురోగతిని ఆన్లైన్ ద్వారానే తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేయడం ఈజీ.. టీఎస్–బీపాస్ విధానం ద్వారా భవనాలు, లే–అవుట్ల నిర్మాణానికి అనుమతులు, ఆక్యుపెన్సీ, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, భూవినియోగ మార్పిడి, పెట్రోల్ బంక్‌లకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీతో పాటు అక్రమ కట్టడాలపై ఫిర్యాదులను ఆన్లైన్లోనే స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రస్తుతం ట్రయల్ రన్‌గా వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పురపాలక మంత్రి కె.తారకరామారావు త్వరలో దీన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో సెల్‌ఫోన్, కంప్యూటర్ నుంచి సులువుగా దరఖాస్తు చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఆన్లైన్లో దరఖాస్తుదారులు తమ వివరాలు, ప్లాట్, భవనం సమాచారమివ్వాలి. స్థల యాజమాన్య హక్కులు, ఈసీ డాక్యుమెంట్, బిల్డింగ్/లే–అవుట్ ప్రతిపాదిత ప్లాన్ పీడీఎఫ్ కాపీతో పాటు సైట్ ఫొటోను అప్లోడ్ చేయాలి. చివరగా ఆన్లైన్ ద్వారా నిర్దేశిత ఫీజులు చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తుల ప్రక్రియలో ఇబ్బందులుంటే 040–2331 4622 నంబర్‌కు ఫోన్‌చేస్తే అనుమానాలను నివృత్తి చేస్తారు. రూపాయికే రిజిస్ట్రేషన్.. తక్షణమే అనుమతులు, ఎన్ఓసీలు టీఎస్–బీపాస్ పథకం కింద భవనాలు, లేఅవుట్లు, ఆకాశహరŠామ్యలు, మల్టీప్లెక్సులు, థియేటర్లు, పెట్రోల్ బంకులు, టౌన్షిప్లకు అనుమతులు, ఎన్ఓసీల జారీ తదితర సేవలకు కచ్చితమైన గడువులను ప్రభుత్వం నిర్దేశించింది. సింగిల్ విండో విధానంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దరఖాస్తు ద్వారా అన్ని రకాల అనుమతులు, ఎన్ఓసీలను నిర్దేశిత గడువులోగా జారీచేస్తాయి. 75 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్+1 అంతస్తు వరకు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. స్వీయ ధ్రువీకరణ ద్వారా రూ.1 చెల్లించి టీఎస్–బీపాస్ వెబ్సైట్లో ఇన్‌స్టంట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి ఆస్తిపన్నును అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఊరట కలిగించనుంది. 75 చదరపు గజాల నుంచి 500 చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇన్‌స్టంట్‌గా అనుమతులు జారీ చేస్తారు. తక్షణమే ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టవచ్చు. ఒకవేళ తప్పుడు వివరాలిచ్చినా, ప్లాన్‌ను ఉల్లంఘించినా అనుమతులు రద్దుచేసి నోటీసులివ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తారు. 500 చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో నివాస భవనాలు, అన్ని రకాల నివాసేతర కేటగిరీ భవనాలు, ఎస్ఆర్డీపీ/ఆర్డీపీ/రోడ్డు, నాలా విస్తరణ కేసులు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్), సెట్ బ్యాక్స్ ట్రాన్స్ఫర్ వంటి వాటికి మాత్రం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా అనుమతులిస్తారు. అలాగే 72 రోజుల్లో లేఅవుట్లకు ప్రాథమిక అనుమతులు, మరో 21 రోజుల్లో తుది అనుమతులు జారీ చేస్తారు. నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు జారీకాని పక్షంలో అనుమతి వచ్చినట్టుగానే పరిగణించి నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం టీఎస్–బీపాస్ చట్టంలో పేర్కొంది. సేవల వారీగా నిర్దేశిత గడువులను ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో ఈ మేరకు టీఎస్–బీపాస్ చట్టానికి సంబంధించిన నిబంధనలతో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆపై ఈ కొత్త అనుమతుల విధానం అమల్లోకి వస్తుంది. -
ఉల్లంఘనలు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు చెలరేగిపోయారు. అధికారం అండతో టౌన్‌ప్లానింగ్ అధికారులను డమ్మీలను చేసి, అనుమతులు లేకుండా భారీ వ్యాపార సముదాయాలు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. కమర్షియల్ భవనాల్లో పార్కింగ్ వసతి కోసం సెల్లార్లు నిర్మించాల్సి ఉంది. చాలా మంది భవన యజమానులు సెల్లారు లేకుండానే భవనాలు నిర్మించారు. నిర్మించిన సెల్లార్లను దుకాణాలు, గోడౌన్లుగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనులపై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. సాక్షి, నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో పాఠశాలలు, కళాశాలలు, వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాలు, ఇతర కమర్షియల్ భవనాల్లో సెల్లార్లు లేకుండానే యజమానులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో కొందరు భవన యజమానులు అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆయా కమర్షియల్ భవనాల్లో సెల్లార్లు లేకపోవడంతో రోడ్లు పైనే పార్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతి, గత ప్రభుత్వ పాలకుల ఒత్తిడితో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో ఇష్టానుసారంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. నిబంధలన ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్‌లకు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. అయితే ఏ షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తగినంత పార్కింగ్ స్థలాన్ని కేటాయించలేదు. దీంతో నగరంలో వాహనాలు రోడ్లు పైనే పార్కింగ్ చేస్తున్నారు. అసలే రోడ్లు 30 నుంచి 35 అడుగులు మాత్రమే ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 40 నుంచి 50 షాపింగ్ కాంప్లెక్స్‌లు, వందకు పైగా భారీ వ్యాపార దుకాణాల సముదాయాలు ఉన్నాయి. దాదాపు అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు పార్కింగ్‌కు తగిన స్థలాన్ని ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా ట్రంకురోడ్డు, నర్తకీ సెంటర్, గాంధీబొమ్మ, వీఆర్సీ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, మినీబైపాస్‌రోడ్డు, కేవీఆర్ పెట్రోల్ బంక్, వేదాయపాళెం తదితర ప్రాంతాల్లో భారీ షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇదే సమస్య తలెత్తుతుంది. వీటి పరిస్థితిపై నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి దృష్టి సారించారు. సెల్లార్లు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, సెల్లార్లు ఉండి దుకాణాలు, గోడౌన్లు వినియోగిస్తున్న భవనాలను గుర్తించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇప్పటి వరకు దాదాపు 35 భవనాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భవన యజమానులకు నోటీసులు జారీ చేసి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కళాశాలల భవనాల పరిస్థితి అంతే! నగరంలోని ప్రధాన కూడళ్లలో కళాశాలల భవనాల్లో దాదాపు 50 శాతం భవనాలకు పార్కింగ్ స్థలం లేదు. రోడ్డు మీదే వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సెల్లార్లు లేకుండా రెసిడెన్షియల్ భవనాలుగా నిర్మించి కళాశాలలకు భవనాలను బాడుగులకు ఇస్తున్నారు. దీంతో కళాశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థుల వాహనాలను రోడ్లు పైనే పార్కింగ్ చేయాల్సి వస్తుంది. వారం రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం గతంలో ఇష్టారాజ్యంగా సెల్లార్లు లేకండా భవనాలు నిర్మించారు. దీంతో షాపింగ్ మాల్స్‌కు వచ్చేవా రు రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. భవన యజమానులకు వారం రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం. పోలీస్ శాఖ సహకారంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – పీవీవీఎస్ మూర్తి, కార్పొరేషన్ కమిషనర్ -
వక్ఫ్ స్థలాల్లో.. రియల్ దందా
తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి అనుచరుల భూదాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చివరకు వక్ఫ్‌బోర్డు ఆస్తులను సైతం వదలడం లేదు. వక్ఫ్ స్థలాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించి రెవెన్యూ అధికారులు ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ‘హెచ్చరిక బోర్డుల’ను సైతం ఒక్కరోజు కూడా గడవకుండానే తొలగించేసి..దందా కొనసాగిస్తున్నారు. వక్ఫ్ స్థలాలను ‘రియల్’ వెంచర్లుగా మార్చేసి..పెద్దపెద్ద భవంతులు కడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిని సైతం బెదిరిస్తున్నారు. నంద్యాల : నంద్యాలలోని పద్మావతినగర్, నూనెపల్లె, టెక్కె తదితర ప్రాంతాల్లో మసీదులకు సంబంధించిన దాదాపు వంద ఎకరాల భూములు, స్థలాలు అక్రమార్కుల పరమయ్యాయి. దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే వీటిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. పంచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వక్ఫ్‌బోర్డు పరిధిలో నంద్యాల, పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాలు భూములు, స్థలాలు ఉండేవి. వీటిని భద్రంగా కాపాడాల్సిన పెద్దలు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే బోగస్ రిజిస్ట్రేషన్లతో అక్రమార్కులు కొందరు వీటిని గుట్టుచప్పుడు కాకుండా మరొకరికి అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల–కోవెలకుంట్ల రహదారిలోని రైతునగరం గ్రామ పంచాయతీ మీదుగా ఫోర్‌లేన్ జాతీయ రహదారి నూతనంగా ఏర్పడటంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఇదే ఆసరాగా ఇక్కడున్న వక్ఫ్‌బోర్డు స్థలాల్లో టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సభ్యులు పరిశీలించినా.. నంద్యాల పట్టణంలో ఆక్రమణలో ఉన్న స్థలాలను సెంట్రల్ వక్ఫ్ సభ్యులు ఈ ఏడాది మే నెలలో పరిశీలించారు. సూఫీ మత గురువులు అయిన అల్తాఫ్ రజా(రాష్ట్ర ముస్లిం సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి), మౌలానా అఫ్సర్ రుజ్మునా(ఆలిండియా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు), కార్యవర్గ సభ్యులైన మహమ్మద్అలీ, హైకోర్టు న్యాయవాది మసూద్ అలీజిన్నా, ఇంజినీర్ మహమ్మద్ హమీద్ పట్టణంలోని పద్మావతినగర్, నూనెపల్లె, టెక్కె బాలా కాంప్లెక్స్, ముబారక్ ఫంక్షన్‌హాల్ తదితర ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించారు. వక్ఫ్ ఆస్తులను కొందరు వ్యక్తులు తప్పుడు సర్వే నంబర్లతో ఎన్ఓసీలు సృష్టించి ఆక్రమించుకున్నట్లు వీరు గుర్తించారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని, వీటిలో కట్టడాలు చేపట్టవద్దని వారు హెచ్చరించారు. అయినప్పటికీ ఆక్రమణదారులు లెక్కచేయకుండా వెంచర్లు వేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు తొలగించి.. నంద్యాల – కోవెలకుంట్ల రహదారిలోని రైతునగరం పంచాయతీలో నూతనంగా వెంచర్ వేసిన శ్రీజగజ్జననీ నగర్ కాలనీకి వెళ్లడానికి రహదారి కోసం నాయకులు ఎకరా వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఆక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జయరామిరెడ్డి తన సిబ్బంది, పోలీసులతో కలిసి వెళ్లి ఆక్రమించుకున్న రహదారిని పొక్లెయిన్‌తో తొలగించారు. అనంతరం ‘ఈ ప్రదేశం వక్ఫ్‌బోర్డుకు సంబంధించినది.ఇందులో ఆక్రమణలు నిషేధించడమైనది. ఆక్రమించిన వారు చట్టరీత్యా శిక్షార్హులు’ అని జిల్లా కలెక్టర్ పేరుతో బోర్డు పాతించారు. అయితే.. ఒక్కరోజు కూడా గడవకముందే ఆ బోర్డును తొలగించి, రహదారిని సైతం ట్రాక్టర్లు, లారీలు వెళ్లే సైజులో చదును చేశారు. నిర్మాణాలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ స్థలంలో రహదారి తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై నంద్యాల టీడీపీ కౌన్సిలర్ కొండారెడ్డి, ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు. తాము అధికార పార్టీ నాయకులమని, తమ స్థలంలోకే వచ్చి తొలగిస్తారా అంటూ చిందులు తొక్కారు. అలాగే ఓ వీఆర్ఓను కిందకు తోసేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని, మీరేమైనా మాట్లాడుకోవాలంటే కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని చెప్పినా వారు వినకపోవడం శోచనీయం. అధికారం ఉందన్న ధీమాతో జగజ్జననీనగర్లోని ఎనిమిది ఎకరాల్లో వెంచర్లు వేశారు. కనీసం ఆ ప్రదేశాన్ని ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయించలేదు. యథేచ్ఛగా కట్టడాలు టీడీపీ నాయకులు నూనెపల్లెలోని వక్ఫ్‌బోర్డు స్థలాలను ఆక్రమించి కట్టడాలను చేపడుతున్నారు. రెండున్నర సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తే రూ.25 లక్షలు, స్థలం అయితే రూ.10 లక్షల చొప్పున ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. అక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆక్రమిత స్థలాల్లో ‘వక్ఫ్‌బోర్డు స్థలాలు’ అంటూ బోర్డులు పాతారు. అయితే.. ఆక్రమణదారులు నంద్యాల టీడీపీ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి రెవెన్యూ అధికారులకు ఫోన్ చేయించారు. ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడెందుకు మీరు జోక్యం చేసుకుంటున్నారంటూ సదరు ప్రజాప్రతినిధి అధికారులపై చిందులు వేసినట్లు సమాచారం. ఇంతటితో ఆగిపోవాలని, లేకపోతే మీరు జిల్లా పరిసర ప్రాంతాల్లో పని చేయలేరని ఘాటుగా హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకే బోర్డులు పాతుతున్నామని, ఏమైనా ఉంటే ఆయనతోనే మాట్లాడుకోవాలని, తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో ఆ ప్రజాప్రతినిధి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆక్రమిత స్థలాల్లో ముస్లింలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలి వక్ఫ్‌బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కొందరు అక్రమార్కులు వాటిని ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన స్థలాల్లో కూడా వెంచర్లు వేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. వక్ఫ్‌బోర్డు స్థలాల్లో నిర్మిస్తున్న కట్టడాలను ఆపాలి. నంద్యాలలోఎంతో మంది నిరుపేద ముస్లింలు ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు గురైన వక్ఫ్‌బోర్డు స్థలాలను స్వాధీనం చేసుకొని.. వాటిలో పేద ముస్లింలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి. అధికారులు ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా పని చేసి.. వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడాలి. – శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ నేత వక్ఫ్ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు నూనెపల్లె పరిధిలోని రైతునగర్ గ్రామ పొలిమేరలో 70ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములను గుర్తించారు. ఎక్కువ శాతం ఆక్రమణకు గురయ్యాయి. వీటిలో కట్టడాలు నిర్మిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవు. వక్ఫ్ స్థలాలను ఆక్రమించి వేసిన రహదారులను రెండు రోజుల క్రితం పోలీసులతో వెళ్లి తొలగించాం. కలెక్టర్ పేరుతో హెచ్చరికబోర్డులు కూడా పెట్టాం. ఈ బోర్డులను ఎవరైనా తొలగిస్తే కేసులు నమోదు చేస్తాం. – జయరామిరెడ్డి, నంద్యాల తహసీల్దార్ -
నీరవ్, చోక్సీలకు భారీ షాక్
సాక్షి,ముంబై: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, డైమండ్ వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలకు భారీ షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.13 వేల కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో దాక్కున్ననీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల అక్రమ బంగళాలను కూల్చివేయాలని మహారాష్ట ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. రాయ్‌గడ్ జిల్లా కిహిమ్ గ్రామంలో ఉన్న నీరవ్ మోదీ బంగ్లాను, ఆవాస్ గ్రామంలోని చోక్సీ అక్రమ భవనాలను కూల్చివేయనున్నామని మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాందాస్ కదం తెలిపారు. అక్రమ బిల్డింగ్‌ల వ్యవహారంలో ప్రభుత్వ తాత్సారంపై ముంబై హైకోర్టు అంసతృప్తిని, అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మోదీ, చోక్సీలకు చెందిన ఈ బంగ్లాలను ఇప్పటికే ఈడీఎటాచ్ చేసింది. కాబట్టి ఈ బంగ్లాల కూల్చివేత ప్రక్రియలో ఈడీ అనుమతి తీసుకున్న తర్వాత ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ ప్రకటించారు. ఆలీబాగ్, మురాద్ తీర ప్రాంతంలో మోదీ, చోక్సీలతో పాటు, ఇతర సెలబ్రిటీలు తీరప్రాంత రెగ్యులేషన్ జోన్ (సిఆర్జెడ్) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన బంగళాలు 111 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే కొన్ని బంగళాల యజమానులు వాటిపై చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం నుంచి నిలుపుదల ఉత్తర్వులను పొందడంతో ఈ కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేశామన్నారు. మరో రెండు మూడునెలల్లో వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. -
అక్రమాలకు రెడ్‌కార్పెట్
– యథేచ్ఛగా నగరంలో అక్రమ కట్టడాలు – చేష్టలుడిగి చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అనంతపురం న్యూసిటీ : అధికార పార్టీ అండ.. టౌన్ ప్లానింగ్ అధికారుల బాధ్యతారాహిత్యంతో నగరంలో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల లోపాయికార ఒప్పందాలకు అధికార పార్టీ నేతల ప్రోత్సాహం తోడవడంతో అనధికార కట్టడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సుమారు వందకు పైగా అక్రమ కట్టడాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్థంగా తయారవుతున్న తరుణంలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి నగరాన్ని మరింత రద్దీ చేసేందుకు పాలకులు, అధికారులే కంకణం కట్టుకున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. బీపీఎస్‌తో లింక్ నగరంలో అక్రమ కట్టడాలకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)తో ముడిపెడుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రభుత్వం బీపీఎస్‌కు అనుమతి ఇస్తుందని అప్పటి వరకు ఏవిధంగా కట్టినా పర్వాలేదన్న ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా బిల్డర్లు, యజమానులు వారికి నచ్చినట్లు కట్టడాలు చేపడుతున్నారు. వాస్తవంగా 2014 డిసెంబర్‌లోపు నిర్మాణాలు చేపట్టిన వారికి ప్రభుత్వం బీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. నగరంలో బీపీఎస్ కింద 1068 దరఖాస్తు చేసుకోగా అందులో 768 మంది క్లియరెన్స్ రాగా ఇంకా 300 వరకు పరిష్కారానికి నోచుకోలేదు. బీపీఎస్ క్లియర్ చేసుకోని వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సెల్లార్లకు రెడ్‌కార్పెట్ సెల్లార్లకు పూర్తీ స్థాయిలో అనుమతి లేదు. కమర్షియల్ ఆలోచనతో ఇష్టారాజ్యంగా సెల్లార్లు నిర్మిస్తున్నారు. కమర్షియల్‌కు 500 చదరపు అడుగులు (12 1/2 సెంట్లు) ఉంటే సెల్లార్‌కు అనుమతి ఉంటుంది. అదే రెసిడెన్షియల్‌కు 750 (18 1/2 సెంట్లు) చదరపు అడుగుంటే సెల్లార్‌కు అనుమతిస్తారు. అలాంటిది రెండు, మూడు సెంట్ల స్థలం ఉన్నా అందులో సెల్లార్లు నిర్మిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే సెల్లార్ మునిగిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. 2016 జూన్ 27న కురిసిన భారీ వర్షంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్ మునిగిపోవడం దీనికి చక్కది ఉదాహరణ. అన్నీ అతిక్రమణలే.. నగరంలో భవన అతిక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు సాక్షాత్తు కమిషనర్ పీవీవీఎస్ మూర్తినే చెబుతున్నారు. ఇలాంటివి ప్రధాన ప్రాంతాల్లోనే 31 మంది భవనాలను గుర్తించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలకు చెక్ పెడుతాం – పీవీవీఎస్ మూర్తి , కమిషనర్ నగరంలో అక్రమ నిర్మాణాలున్న మాట వాస్తవమే. కొందరు ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇలాంటి కట్టడాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. త్వరలోనే అక్రమ నిర్మాణాలకు చెక్ పెడతాం. -
డామిట్...సీన్ రివర్స్!
అనుకున్నదొకటి..అయినదొక్కటి..అన్నట్లుంది జీహెచ్ఎంసీ పరిస్థితి. ప్రభుత్వ భూముల్లో వెలిసిన లక్షకుపైగా అక్రమ భవనాల నుంచి సూపర్ స్ట్రక్చర్స్ ట్యాక్స్ (ఆస్తి పన్ను తరహాలోనే..) రూపంలో ఏటా రూ.40 కోట్లు ఆర్జించవచ్చని అంచనా వేశారు. అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించారు కూడా. తీరా నోటీసులు జారీ చేసే నాటికి సీన్‌రివర్స్ అయింది. కేవలం 1506 భవనాలకు పన్ను చెల్లించాలని నోటీసులిచ్చారు. వీటి నుంచి కేవలం రూ.40 లక్షలే వచ్చే అవకాశం ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే...అక్రమ నిర్మాణాలను వెదుకుతున్నామని...దొరకగానే నోటీసులిస్తామంటున్నారు. కానీ...దీనివెనుక అసలు మతలబు ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణదారులతో లాలూచీపడి కొందరు గ్రేటర్ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిటీబ్యూరో: అనుకున్నదొకటి..అయినదొక్కటి..అన్నట్లుంది జీహెచ్ఎంసీ పరిస్థితి. నగరంలో చెరువులు, నోటరైజ్ట్, యూఎల్సీ, దేవాదాయ, వక్ఫ్ , తదితర ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ భవనాలు లక్షకు పైగా ఉన్నట్లు అంచనా వేశారు. వాటన్నింటికీ ఆస్తిపన్ను (సూపర్ స్ట్రక్చర్స్ ట్యాక్స్) వసూలు చేస్తే పెనాల్టీలతో సహా జీహెచ్ఎంసీకి ఎంత లేదన్నా ఏటా రూ. 40 కోట్ల ఆదాయం వస్తుందని భావించారు. వాటిని కూల్చివేసేంత వరకు ఈ ఆదాయం పొందవచ్చని భావించారు. ఆమేరకు అనుమతించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు గత నవంబర్‌లో ప్రభుత్వానికి నివేదించారు. అందుకు ప్రభుత్వం సైతం ఆమోదం తెలపడంతో అక్రమంగా నిర్మించిన భవనాలకు నోటీసులు జారీ చేసి పెనాల్టీతో సహా ఆస్తిపన్ను వసూలు చేయాలని భావించారు. దాదాపు ఆర్నెళ్లుగా ఈ పనిచేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసిన అక్రమ నిర్మాణాలు 1506 మాత్రమే. మిగతా వాటికి ఎందుకు నోటీసులు జారీ చేయలేదంటే సదరు భవనాలను వెతుకుతున్నామనే సమాధానాలు వస్తున్నట్లు తెలిసింది. అంటే నిజంగానే సదరు అక్రమ నిర్మాణాలు దొరకక వెతుకుతున్నారా లేక అక్రమ నిర్మాణదారులతో లాలూచీ పడి సంబంధిత అధికారులు వారికి నోటీసులే జారీ చేయలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతుల్లేకున్నా సదుపాయాలు.. ప్రభుత్వ భూములైన చెరువు స్థలాలు, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల్లో ఎలాంటి నిర్మాణ అనుమతులు తీసుకోకుండా భవనాలు నిర్మించుకున్నవారు లక్షమందికి పైగా ఉన్నారని జీహెచ్ఎంసీ అధికారులే ప్రాథమిక సర్వేలో అంచనా వేశారు. వారి నుంచి ఆస్తిపన్ను వసూలు చేస్తే వారు తమకు భూమిపై హక్కు ఉందని కోర్టులకు వెళతారనే అంచనాలతో ఎన్నో ఏళ్లుగా సదరు భవనాల నుంచి ఆస్తిపన్నే వసూలు చేయడం లేరు. ఎలాంటి అనుమతులు, సేల్‌డీడ్ పత్రాలు, తదితరమైనవేవీ లేకున్నా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవడంతో స్థలంపై హక్కుకు వివాదాలు తలెత్తుతాయనే తలంపుతో వారినుంచి ఎలాంటి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు. మిగతా వారితో పాటు రోడ్లు, పార్కులు, ఆటస్థలాలు, తదితర సదుపాయాలన్నీ కల్పిస్తున్నందున వారు పొందుతున్న ఈసేవలకు పన్ను వసూలు చేయవచ్చునని భావించారు. అయితే ఈ పన్నును సాధారణ ఆస్తిపన్నుగా కాక సూపర్ స్ట్రక్చర్స్ ట్యాక్స్‌గా పేరుపెట్టారు. ఈపన్ను వసూలు కోసం ప్రభుత్వానికి నివేదించగా, అంగీకరించడంతో వసూలుకు నోటీసుల జారీ చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఆస్తిపన్ను కట్టనందున కనీసం మూడేళ్ల నుంచి పెనాల్టీలు కూడా విధించాలని భావించారు. తద్వారా ఏటా రూ. 40 కోట్లు వస్తాయని అంచనా వేశారు. తీరా ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో కేవలం 1506 మందికి మాత్రమే నోటీసులు జారీ కావడం చూసి ఉన్నతాధికారులు విస్తుపోయారు. వీటి ద్వారా దాదాపు రూ.40 లక్షలు మాత్రమే రాగలవని అంచనా. మిగతా వారందరికీ నోటీసులు జారీ చేసి, సూపర్ స్ట్రక్చర్ పన్ను వసూలు చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే ఏ మేరకు ఈ పన్నులు వసూలవుతాయో వేచి చూడాల్సిందే. -
వస్తోంది.. టాస్!
జీహెచ్‌ంఎసీలో కొత్త రకం పన్ను అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దైన్యంగా ఉండటంతో వివిధ మార్గాల ద్వారా ఖజానా పరిపుష్టి చర్యలకు సిద్ధమైంది. నిర్మాణ అనుమతుల్లేని అక్రమ భవనాల నుంచి సైతం పన్ను వసూలు చేయాలని భావిస్తోంది. తద్వారా ఏటా రూ. 40 కోట్ల మేర ఆదాయం రానుందని అంచనా వేసింది. ఆస్తి పన్ను తరహాలో కాకుండా ‘ట్యాక్స్ ఆన్ స్ట్రక్చర్(టాస్)’గా ఈ మెత్తం వసూలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టైటిల్‌డీడ్, భవన నిర్మాణ అనుమతులు అన్నీ సక్రమంగా ఉన్న భవనాల నుంచి మాత్రమే ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. అనుమతుల మేరకు నిర్మాణం జరిగిందని ధ్రువీకరించే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) ఉన్న భవనాల నుంచే ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. అరుుతే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని భూములు, యూఎల్సీ, నాలాలు తదితర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు. జీహెచ్ఎంసీ చట్టం మేరకు ప్రతి భవనం నుంచి ఆస్తిపన్ను వసూలు చేసే వెసులుబాటు ఉండటంతో గతంలో అక్రమ నిర్మాణాల నుంచి సైతం ఆస్తిపన్ను వసూలు చేశారు. అరుుతే ఆస్తిపన్ను వసూలు చేయడం ద్వారా ప్రభుత్వ / వివాదాస్పద భూముల్లో భవనాలు కట్టుకున్నవారు తమకు సదరు భూమిపై హక్కు వస్తుందని భావించే అవకాశం ఉన్నందున దాదాపు ఐదేళ్ల నుంచి ఆ భూముల్లో నిర్మించిన భవనాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు. సదరు భవనాల యజమానులనుంచి జీహెచ్ఎంసీ అధికారులు విచ్చలవిడిగా లంచాలకు పాల్పడుతున్నారని విజిలెన్స నివేదికలు కూడా అందడంతో వాటిపై ఆస్తిపన్ను వసూళ్లను ఆపివేశారు. న్యూ ఐడియా .. ‘టాస్’! ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఆదాయ సేకరణకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తోన్న అధికారుల కన్ను వాటిపై పడింది. అందరి లాగే వారికి కూడా రహదారులు, పారిశుధ్యం, పార్కులు, ఆటస్థలాలు తదితర సదుపాయాలు కల్పిస్తూ సేవలందిస్తున్నందున పన్ను వసూలు చేయవచ్చునని భావించారు. అరుుతే ఆస్తిపన్నుగా వ్యవహరిస్తే.. భూమిపై హక్కు తదితర సమస్యలు తలెత్తనుండటంతో భవనాల్లోని వారికి కల్పిస్తున్న సదుపాయాల పేరిట ‘ట్యాక్స్ ఆన్ స్ట్రక్చర్(టాస్)’గా వసూలు చేయాలని భావిస్తున్నారు. తద్వారా భూమిపై ఎలాంటి హక్కు ఉండదని కూడా వారికి జారీ చేసే నోటీసుల్లో స్పష్టంగా పేర్కొననున్నారు. యజమానులకు స్థలంపై హక్కు లేనప్పటికీ, భవనాల్లో ఉంటున్నందుకు అందిస్తున్న సేవలకు గాను ఈ ట్యాక్స్‌ను వసూలు చేయవచ్చునని భావిస్తున్నారు. ఈమేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. సదరు స్థలాల్లో సర్వే చేసి ఎన్ని నిర్మాణాలున్నాయో, వాటి ద్వారా ఎంత ఆదాయం రానుందో కూడా అంచనా వేసి నివేదించారు. అనుమతి రాగానే వసూళ్ల చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. సదరు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేంతదాకా, లేక కూల్చివేసేంత వరకు వాటి నుంచి ఏటా దాదాపు రూ.40 కోట్లు రాగలవని అంచనా వేశారు. మూడేళ్లకు ముందు నిర్మాణాలు జరిపిన వారికి నూరు శాతం పెనాల్టీ వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. -
చేతులు కాలాక.. నాలాలు
ఇన్ బాక్స్: తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకి దాదాపు అన్ని చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్‌లు నిండాయి. హైదరా బాద్‌లో దశాబ్దాలుగా నాలాలను ఆక్ర మించి ఇళ్లు కట్టుకోవడంతో జరుగుతున్న ఉత్పాతం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. దీనికి తోడు, నాలాలలో పూడిక సరిగ్గా తీయక నీళ్లు రోడ్లపైకి పారి ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆక్రమణలకు గురైన చోట నాళాలు నీటి ఉధృతికి తట్టుకోక చాలా ప్రాంతాలలో ఇండ్లలోకి అపార్ట్ మెంట్లలోకి నీళ్లు వచ్చాయి. నాలాలపై అక్రమంగా ఇండ్లు కట్టుకున్న వారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నది నిజమే కానీ అక్రమ కట్టడాలను, నాలాల పరీవాహక ప్రాంతాలని సరిచేయకపోతే మునుముందు చాలా ప్రమాదకరం. కిర్లోస్కర్ నివేదిక ప్రకారం నగరంలో 28 వేల నాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజాం పేటలోని బండారి లే అవుట్ సముద్రంగా మారడంతో ప్రజల ఇబ్బందులు అంతాఇంతా కాదు. నాలాలపై అక్రమ కట్టడాలు తొల గించాల్సిందే కాని ఇళ్లు కోల్పో యిన వారికి సరైన ఆవాసం ఏర్ప రిచి ప్రక్షాళన చేస్తేనే రేపటి భారీ వర్షాలను ఎదుర్కొని నిలబడగలం.. కనీ వినీ ఎరుగకుండా దెబ్బతిని పోయిన అనేక ప్రాంతాల్లో మామూలు పరిస్థి తులు వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలి, భారీవర్ష బాధిత కుటుం బాలకి చేయూత నివ్వాలి. జరుుని రాజేశ్వర్, కాప్రా, హైదరాబాద్ స్వేచ్ఛ, స్వతంత్రం మీకేనా? నా కోసం ఎదురుచూస్తారని తెలుసు/నేను వస్తే పులకించిపోతారని తెలుసు అందుకే నా రాక ఆలస్యమైనా, కచ్చితంగా వస్తానని తెలుసు/మీరు రమ్మన్నప్పుడు నేను రావడానికి చెరువులు, చెట్లను రక్షించారా!/కాలుష్యాన్ని తగ్గిస్తున్నారా!/పోనీ ఈ మారుతున్న కాలానికి,/నా కోసం ఒక ఇంకుడుగుంతనైనా ఏర్పాటు చేసుకున్నారా! చెప్పండి./నాకు చెన్నై పైన లేదు కోపం/హైదరాబాద్ పైన అంతకంటే లేదు. ఎప్పుడొస్తానో తెలియదు/వచ్చినప్పుడు ఎంత మేలు చేస్తానో...అందరికీ తెలుసు/అలాగని భూమాత అంత సహనం నాకు లేదు./ మా 5 గురిలోఎవరికి కోపం తెప్పించినా పరవాలేదు కానీ, /భూమాత సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం/మేమంతా ఒక్కటై ముంచెత్తుతాం జాగ్రత్త!/నా రాక కోసం ఎదురు చూస్తారు/మిమ్మల్ని పలకరిద్దామని వచ్చా!/ఆనందిస్తారు! నష్టం చేసిందం టారు/నష్టాన్ని ఆకాశం నుంచి పరిశీలిస్తారు/విహార యాత్ర చేయడానికి వెళ్ళినట్లు ఉంటుంది /పనులు పేరుకుపోయారుు అంటారు/పేరుకుపోరుున చెత్తను కడిగేశా! నేనంతే!/నా దిశ మారింది../నేను వచ్చి కొన్ని రోజులైనా... అన్నింటినీ/ నిండు కుండల్లా నింపా/ఎంతైనా అనుకున్నట్లు ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ కాలం కదా! కబ్జాల కాలం. అవినీతి కట్టడాల కాలం/ఎక్కడ ఉండమంటారు చెప్పండి. నన్ను స్వేచ్ఛగా ఉండనిచ్చే కాలమా! ఇది/నాకు కూడా స్వేచ్ఛ, స్వతంత్రం కావాలి. ఇట్లు మీ వాన అలియాస్ వర్షం - తలారి సుధాకర్, కరీంనగర్ -
అక్రమ కట్టడాలపై ‘ఆస్తి పన్ను’ పిడుగు
* జరిమానాల వసూళ్లకి కొత్త నిబంధనలపై సర్కార్ కసరత్తు * ఆస్తి పన్నులో 25 నుంచి 100 శాతం జరిమానాలు సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, కూల్చివేత జరిగే వరకు ఆ భవనాలపై ఆస్తి పన్నుల రూపంలో భారీ మొత్తంలో జరిమానాలు విధించేవిధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని అక్రమ కట్టడాలపై ఈ నిబంధనలను అమల్లోకి తెస్తూ త్వరలో రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా అక్రమ కట్టడాలపై ఆస్తిపన్నులో 25 నుంచి 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేయాలని మున్సిపల్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీలో కొన్ని భవనాలపై ఈ జరిమానాలను వసూలు చేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి ఆస్తిపన్నులు, జరిమానాలు చెల్లిస్తున్నందున తమ భవనాల క్రమబద్ధీకరణ జరిగినట్లేనని ఆదేశించాలని కొందరు భవనాల యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడిగా కేసులు పెండింగ్‌లో ఉండిపోతుండడంతో ఈ భవనాల యజమానుల నుంచి ఆస్తిపన్ను, జరిమానాలను వసూలు చేయలేకపోతున్నారు. ఈక్రమంలో జరిమానా చెల్లించినంత మాత్రాన అక్రమ భవనాల క్రమబద్ధీకరణ జరగదనే విధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. త్వరలో టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అక్రమ కట్టడాలకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిర్ణయించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఈ నెల 22న అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
హెచ్ఎండీఏ సర్వర్ ఢమాల్
ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ దరఖాస్తుదారుల్లో అయోమయం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఆన్లైన్ వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. సామర్థ్యానికి మించి లోడ్ పడటంతో సర్వర్లు మొరాయించాయి. దీంతో హెచ్ఎండీఏలో సోమ, మంగళవారాల్లో క్రమబద్ధీకరణ కార్యకలాపాల్లో గందరగోళం నెలకొంది. ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ల కింద అక్రమ భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు తుది గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో దరఖాస్తుదారులు విరా మం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేం దుకు ప్రయత్నించారు. మంగళవారం అధిక సంఖ్యలో ఆల్‌లైన్‌లో దరఖాస్తులు అప్లోడ్ కావడంతో హెచ్ఎండీఏలోని సర్వర్లకు సామర్థ్యానికి మించి లోడ్ పడడంతో12 గంటల తర్వాత మొండికేశాయి. సుమారు 3-4గంటల సేపు కార్యకలాపాలన్నీ స్తంభించాయి. దీంతో రోజూ ఆన్లైన్లో దాఖలయ్యే దరఖాస్తుల సంఖ్య సగానికి తగ్గి మంగళవారం 2వేలకు పడిపోయింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ కింద 44వేల దరఖాస్తులే హెచ్ఎండీఏకు అందాయి. చివరి రోజుల్లో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులకు తెలి సినా... ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హెచ్ఎండీఏకు వచ్చే ఆదాయం కూడా అందకుండా పోయింది. మంగళవారం రాత్రి కూడా సర్వర్లు మొరాయించాయి. మాన్యువల్‌గా అసాధ్యమే.. ఆన్లైన్లో సమస్యల కారణంగా దరఖాస్తు చేసుకోలేని వారు మాన్యువల్‌గా దరఖాస్తులను అందజేయవచ్చని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు చేసిన ప్రకటన కంటితుడుపు చర్యగానే మిగిలింది. నేరుగా దరఖాస్తు చేయాలన్నా... ప్రాథమిక సమాచారాన్ని హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లోని ఆన్లైన్ దరఖాస్తును నింపి, ఆ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని మిగతా డాక్యుమెంట్లు, రూ.10 వేల డీడీ దానికి జతచేసి హెచ్ఎండీఏలో లేదా మండల కార్యాలయంలోని సేవా కేంద్రంలో అందజేయాలని కమిషనర్ సూచించారు. ప్రాథమిక సమాచారాన్ని హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లోని దరఖాస్తులో నమోదు చేసేందుకూ సాధ్యంకాక చాలామంది దరఖాస్తుదారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కొందరు వివరాలను ఆన్లైన్ దరఖాస్తులో నింపి సబ్మిట్ చేసే తరుణంలో సర్వర్లు పనిచేయక డేటా మొత్తం పోయింది. మరి కొందరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు ఆ కాపీకి మిగతా డాక్యుమెంట్లు జతచేసి తార్నాకలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో ఇచ్చేందుకు ప్రయత్నించగా... పలు రకాల మెలిక పెడుతూ తిప్పిపంపుతున్నారు. అయితే... దళారులు తెస్తున్న దరఖాస్తులను మాత్రం వెంటనే స్వీకరించి రశీదు చేతిలో పెడుతుండడం గమనార్హం. ఒక్కో దరఖాస్తుకు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తూ అన్నీ తామే చక్కబెడతామని నమ్మబలుకుతున్నారు. కొందరు దళారులు ముందే జాగ్రత్తపడి డీడీలు తీసిపెట్టుకుని గడువు మీరాక కూడా తాము మీ దరఖాస్తులు హెచ్ఎండీఏలో సబ్మిట్ చేస్తామంటూ బేరం కుదుర్చుకొంటున్నారు. అక్రమాలకు అవకాశం లేకుండా క్రమబద్ధీకరణ గడువును మరో 2నెలలు పెంచాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. సీఐవో ఏమయ్యారు? హెచ్ఎండీఏలో ఏ అధికారి వస్తున్నారు? ఏ అధికారి బయటకు వెళుతున్నారో? తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. హెచ్ఎండీఏలో సర్వర్లు మొరాయించడంతో వాటిని సరిదిద్దే అధికారి లేకపోవడం విధుల పట్ల అధికారులకున్న చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. హెచ్ఎండీఏలో ఆన్లైన్ దరఖాస్తుల వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కన్సల్టెంట్‌గా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐవో)ను నియమించారు. సోమవారం సర్వర్లు పనిచేయకపోవడంతో కాస్త హడావుడి చేసిన సదరు అధికారి మంగళవారం ఏకంగా సెలవులో వెళ్లడంపై ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిజంగా ఆ అధికారికి ఐటీ పై పట్టు ఉందా...? హెచ్ఎండీఏ వెబ్సైట్లో దరఖాస్తుల ఎంట్రీ పెరిగితే... అందుకు తగ్గట్లు సర్వర్ల స్థాయిని ఎందుకు అప్‌గ్రేడ్ చేసుకోలేక పోయారు..? ఎవరి అనుమతితో సెలవు పెట్టారు..? వంటి ప్రశ్నలు హెచ్ఎండీఏ సిబ్బంది నుంచి వ్యక్తమవుతున్నాయి. సీఐఓ అసలు డ్యూటీలో ఉన్నారో...? లేరో..? కూడా హెచ్ఎండీఏ కమిషనర్‌కు సమాచారం లేదంటే అధికారులపై పర్యవేక్షణ ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. -
‘క్రమబద్ధీకరణ’ అర్జీలకు మోక్షం!
త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో 6726 బీపీఎస్, 5165 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఇక దరఖాస్తుల స్వీకరణ లేనట్లే! సాక్షి, హైదరాబాద్: అక్రమ భవన నిర్మాణాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణ పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కని పిస్తోంది. అలాగే ఇక క్రమబద్ధీకరణ కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించరాదని భావిస్తోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఉడాలను మినహాయిస్తే.. తెలంగాణలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వద్ద పెండింగ్‌లో ఉన్న 6,726 బీపీఎస్ దరఖాస్తులు, 5,165 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో వాటిపై నిర్ణయం తీసుకోవాలంటూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సీఎం కార్యాలయాన్ని కోరింది. భవన నిర్మాణంలో ప్లాన్ ఉల్లంఘనలు, అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులైరె జ్ చేసేందుకు అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీపీఎస్) ప్రవేశపెట్టుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2007 డిసెంబర్ 31న జీవో నెం.901 జారీ చేసింది. అప్పుడు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉంచిన 6,726 దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే 2008లోనూ అసమగ్ర వివరాలు, ఇతర కారణాలతో 5,165 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఎల్ఆర్ఎస్ ద్వారా పురపాలక సంస్థలకు రూ.112.57 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పెండింగ్ దరఖాస్తులపై సీఎం పేషీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. -
అనుమతి ఉన్నా... కూల్చేశారు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులకు బుధవారం పెద్ద ఝలక్ తగిలింది. మునిసిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన భవనాన్ని కూడా అక్రమ నిర్మాణం అనుకుని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. తాను నిబంధనల ప్రకారం భవనాన్ని నిర్మించానని యజమాని జీహెచ్ ఎంసీ అధికారులు ఎదుట ఆందోళనకు దిగాడు. దాంతో తమ తప్పు తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగేందుకు ప్రయత్నించారు. తనకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ అధికారులను భవన యజమాని ప్రశ్నించాడు. దాంతో నీళ్లు నమలడం జీహెచ్ఎంసీ అధికారుల వంతైంది. హైదరాబాద్ మాదాపూర్‌లో గురుకుల ట్రస్ట్‌కు చెందిన భూముల్లో అక్రమ కట్టడాలని కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను సోమవారం ఆదేశించారు. దాంతో మంగళవారం రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. రెండవ రోజు బుధవారం అక్రమకట్టడం కూల్చివేస్తు పక్కనే ఉన్న భవనాన్ని కూడా కూల్చివేశారు. దాంతో భవన యజమాని ఆందోళనకు దిగాడు. అ క్రమంలో భవన నిర్మాణానికి పొందిన అనుమతులను భవన యజమాని సదరు అధికారులకు చూపించారు. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు తప్పైపోయిందంటూ నాలిక కర్చుకున్నారు. -
రెండోవ రోజు కొనసాగుతున్న కూల్చివేతలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత బుధవారం వరుసగా రెండోరోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మహేందర్ వెల్లడించారు. అందుకోసం 5 బృందాలు, 100 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. అక్రమ కట్టడాలు కూల్చివేత నేపథ్యంలో అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల వద్ద భారీగా పోలీసులను మొహరించారు. వేలాది కోట్ల రూపాయిల విలువ గల అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూములలో అధిక సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో సదరు భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దాంతో జీహెచ్ఎంసీ మంగళవారం రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.