మా సింగరేణి ఉద్యోగాలు మాకే కావాలి..! | we want singareni jobs | Sakshi
Sakshi News home page

మా సింగరేణి ఉద్యోగాలు మాకే కావాలి..!

Published Mon, Apr 27 2015 12:40 AM | Last Updated on Sun, Sep 2 2018 4:19 PM

మా సింగరేణి ఉద్యోగాలు మాకే కావాలి..! - Sakshi

మా సింగరేణి ఉద్యోగాలు మాకే కావాలి..!

సింగరేణి భూమిపుత్రులమైన మాకు, హక్కు ఉన్న అన్ని ఖాళీలకు అర్హులైన మాకు తొలి ప్రాధాన్యతగా ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, ఇప్పటికే సింగరేణిలో మెడికల్ ఫిట్ అయి అండర్‌గ్రౌండ్ ట్రైనింగ్ కూడా చేసిన, మా 2,700 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఉద్యోగాలు మీ పద్ధతిలో భర్తీ చేసుకోవాలి.
 
 అది 1997వ సంవత్సరం. ప్రపంచ బ్యాంకు విధానాలను దేశంలో అందరికన్నా ముందు ండి అమలు పరుస్తున్న సీఎం చంద్రబాబు హయాం. 1988 లో ఆఖరి పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం ముగిసిపోయి సింగరేణిలో అప్పటికే దశాబ్దం గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వ లేదు. కాని ఉత్పత్తి పది రెట్లు పెరిగి 52 మిలియన్ల టార్గె ట్‌ను కూడా పూర్తి చేసుకుంది.

1997లో వీఆర్‌ఎస్ అప్లై చేసుకుంటే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని సింగరేణి మేనేజ్‌మెంట్, అప్పటి సీఎం చంద్రబాబు చెప్పిన మాట లు నమ్మి 5 నుండి పదేళ్ల సర్వీసు ఉన్నా కూడా సుమారు 2700 మంది కార్మికులు వీఆర్‌ఎస్ అప్లై చేసుకున్నారు. కానీ 18 ఏళ్లు పూర్తయినా సింగరేణి మేనేజ్‌మెంట్, అప్పటి వలస ప్రభుత్వాలు ఇచ్చిన మాట తప్పి నాటి ఉద్యోగుల పిల్లలకు కొలువులివ్వటం కుదరదనీ, అవకా శమన్న రోజు ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకు న్నారు.  1997లో యువకులుగా ఉన్న ఆ పిల్లలు.. నేడు 45 ఏళ్ల వయస్సుకు చేరుకొని నిరుద్యోగులు గానే ఉన్నారు.
 
2001లో తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్, క్యాతన్ పల్లి సర్పంచ్ (ఆర్‌కెపీ కోల్‌మైన్స్ ఏరియా) ఎన్నికల్లో  పాల్గొన్నారు. తెలంగాణ సాధించుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్‌ఎస్ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ చదువులు చదువుకొని బాధలను అనుభవిస్తూనే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించారు ఈ నిరుద్యోగ యువకులు.
 
2014 జూన్ 2 తెలంగాణ కల సాకారమైన రోజు నుండి నిరుద్యోగ వీఆర్‌ఎస్ డిపెండెంట్లు నిరాహార దీక్షలు, పాదయాత్రలు, వినతులు, విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నారు. వీరి ఉద్యమానికి ఎంపీ సుమన్ , విప్ నల్లాల ఓదెలుతోపాటు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, అన్ని ట్రేడ్ యూనియన్ల నాయకులతోపాటు టీబీజీకే ఎస్ నాయకులు మద్దతు పలుకుతూ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమ కాలంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చాలా హామీలను అమలు పరుస్తున్నారు.
 
ఉద్యమంలో పాల్గొ న్న 550 మంది ధూంధాం కళాకారులకు నిన్నగాక మొ న్న ఉద్యోగాలను ఇచ్చారు. సింగరేణిలో 5,500 మందికి ఉద్యోగాలను కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. సింగ రేణి మేనేజ్‌మెంట్ జారీ చేసిన అన్ని రకాల ఉద్యోగాలకు మేము సంపూర్ణంగా అర్హత కలిగి ఉన్నాము. దురదృష్ట మేమిటంటే 1997 నాటికి మా వయస్సు 25 నుండి 30 సంవత్సరాలు. ఇప్పుడు మేం 40 నుండి 45 ఏళ్లు కలిగి ఉండి మీ ఉద్యోగ ప్రకటనకు వయస్సు అర్హతలు కూడా కోల్పోయాము.
 
1988లో ఆఖరు రన్నింగ్ వరకు సింగరేణి ఉద్యోగా ల్లో చేరిన వారు ఏ ఒక్కరు కూడా భూమి పుత్రులు కారు. ఆనాటికి సింగరేణిలో ఉన్న ఒక లక్షా పదహారు వేల మంది కానీ, అంతకు ముందు రిటైర్డ్ అయిన వేల మంది కానీ వీరంతా తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతోపాటు ఆంధ్రా ప్రాంతం నుండి వలస వచ్చి ఉద్యోగాలు చేసిన వారే. కానీ ఈ వీఆర్‌ఎస్ కార్మికుల పిల్లలమైన మేము 2,700 మందిమీ, ఈ సింగరేణి నేల భూమిపుత్రులం.

మేమంతా సింగరేణిలో పని చేస్తున్న మా తల్లిదండ్రుల నివాస ప్రాంతాలైన గోలేటి, బెల్లంపల్లి, మందమర్రి, రామక్రిష్టాపూర్, శ్రీరాంపూర్, గోదావరిఖని, భూపా ల్‌పల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సింగరేణి ప్రాంతానికి చెందిన పిల్లలం. 1997లో, 2003లో సింగ రేణి మేనేజ్‌మెంట్ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకొని కూడా ఇవ్వకుండా పోవడంతో మోసపోయిన వీఆర్‌ఎస్ కార్మికుల పిల్లలం.
 
 మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూ డు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 5,500 మంది ఉద్యోగాలకు సింగరేణి మేనేజ్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముందుగా సింగరేణి భూమిపుత్రులుగా అన్ని ఖాళీలకు అర్హత కలిగిన మాకు, మొట్టమొదటి ప్రాధాన్య తగా ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా ఇప్పటికే సింగరేణిలో మెడికల్ ఫిట్ అయి అండర్‌గ్రౌండ్ ట్రైనింగ్ కూడా చేసిన, మా 2,700 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఉద్యోగాలు మీ పద్ధతిలో భర్తీ చేసుకోవాలి.

మీరు తీసుకొనే నిర్ణయం ద్వారా అన్ని రకాలుగా హక్కు లు, అర్హతలు కలిగిన మా పిల్లలకు, మా కుటుంబ సభ్యు లకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడతారనే విశ్వాసంతోనే మీ సింగరేణి వీఆర్‌ఎస్ డిపెండెంట్ కార్మికులు, సింగరేణి భూమి పుత్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
 న్యాయంగా, ధర్మంగా, సహజ న్యాయసూత్రాల ప్రకారం 100 శాతం నిజమైన సింగరేణి భూమి పుత్రుల మైన మా 2,700 మందికి ముందుగా ఉద్యోగాలిచ్చి  మిగతా ఖాళీలను మీ సెలెక్షన్ ద్వారా ఇచ్చుకోండి. ‘మీరు తీసుకునే నిర్ణయం ద్వారా మా జీవితాల్లో చీకటి తొలగించి వెలుగులు నింపాలని’ కోరుతున్నాము.
 
 - గురిజాల రవీందర్‌రావు
 వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక సెల్ : 9849588825
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement