ఖమ్మం-నల్గొండ సరిహద్దు ప్రాంతమైన పైనంపల్లి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాలలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న విజయమ్మను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఆమెను నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమెను పోలీసులు హైదరాబాద్ కు తరలించనున్నారు. విజయమ్మ అరెస్ట్కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసతన తెలిపారు.