లక్నో : లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎస్పీ-బీఎస్పీ కూటమి దేశానికి తదుపరి ప్రధానిని అందిస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పారు. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు తాము బీఎస్పీతో జట్టుకట్టామని వెల్లడించారు. యూపీలోని కన్నౌజ్‌లో గురువారం జరిగిన ప్రచార ర్యాలీలో బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. కాగా ఇదే వేదికపై నుంచి మాయావతి ప్రసంగించేందుకు ముందు అఖిలేష్ భార్య, కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న డింపుల్ యాదవ్ మాయావతి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.
కాగా ఏప్రిల్ 29న సహరన్‌పూర్, ఖేరి, హర్దోయ్, మిశ్రిఖ్, ఉన్నావ్, ఫరక్కాబాద్, ఇటావా, కాన్పూర్, అక్బర్‌పూర్, జలన్, ఝాన్సీ, హమీర్పూర్ స్ధానాలతో పాటు కన్నౌజ్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కీలకమైన యూపీలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకునేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమి, బీజేపీలు పోటీపడుతుండగా, ప్రియాంక ఎంట్రీతో తమ విజయావకాశాలు మెరుగయ్యాయని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment