సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌కు అత్యంత సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపైనే ఐటీ దాడులు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై 5 రోజుల పాటు ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఐటీ సోదాలపై చంద్రబాబు ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్ భారీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. రాజధాని నిర్మాణం అతి పెద్ద స్కామ్ అని అన్నారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారని.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పారని గుర్తుచేశారు.
బాబు వ్యుహం ఫలించలేదు..
టీడీపీ మునిగిపోతున్న నావా అని అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు కుట్ర పూరితంగా దెబ్బతీశారని గుర్తుచేశారు. టీడీపీ అంతరించి పోయే స్థితికి చేరిందన్నారు. పథకం ప్రకారం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా పార్టీకి దూరం చేశారని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుమారుడిని లోకేష్‌ను వారసుడిగా చేయాలనుకున్న వ్యుహం ఫలించలేదని చెప్పారు. లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment