
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు సాయం చేయమని ప్రధాని మోదీ తనను కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్తూ వచ్చిన అబద్ధాన్ని ఇప్పుడు మోదీ నిజం చేశారని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయం దారుసలాంలో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సోమవారం మోదీ.. ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన తీరుపై అసదుద్దీన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ అంశం భారత్–పాకిస్తాన్‌లకు సంబంధించిన ద్వైపాక్షిక విషయం. ఇందులో మూడో దేశం జోక్యం ఉండొ ద్దు. మన్‌కీబాత్ లాంటి వేదికల్లో మోదీ దీన్ని స్పష్టం చేశారు. కశ్మీర్‌పై మన విధానాన్ని మోదీ ఎందుకు మార్చారు?’అని అసదుద్దీన్ ప్రశ్నించారు.