న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆప్ పార్టీ తరఫున తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆతిషి విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతకు విషయం ఏంటంటే.. ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న పాంప్లెట్లు పంచారు. అయితే ఈ పాంప్లెట్ల వెనక బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ‘గంభీర్ నువ్వు ఇంత నీచానికి పాల్పడతావని అనుకోలేదు’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ‘ఆతిషి నీ పరిస్థిని మేం అర్థం చేసుకోగలం. నీకు మద్దతుగా నిలబడి ఇలాంటి దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడతాం. మీరు ధైర్యంగా ఉండండి’ అని తెలిపారు.
ఈ క్రమంలో ఆతిషి మాట్లాడుతూ.. ‘ఓ మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన నువ్వు.. ఇక లక్షలాది స్త్రీలకు ఎలా రక్షణ కల్పిస్తావ్’ అంటూ గంభీర్‌ని ప్రశ్నించారు. అయితే తనపై వస్తోన్న ఈ ఆరోపణలపై గంభీర్ స్పందించారు. ఆతిషిని అవమానిస్తూ.. పాంప్లెట్లు పంచింది తానేనని నిరూపిస్తే.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని గంభీర్ ప్రకటించారు.
My Challenge no.2 @ArvindKejriwal @AtishiAAP
— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 9, 2019
I declare that if its proven that I did it, I will withdraw my candidature right now. If not, will u quit politics?
Comments
Please login to add a commentAdd a comment