సాక్షి, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కేంద్ర మంత్రులనూ ఎన్నికల ప్రచారానికి ఆహ్వానిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి శుక్రవారం ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి రానున్నారు. ప్రచారంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ ఉదయం 10.30 గంటలకు సిర్పూర్ బహిరంగ సభకు హాజరవుతారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్‌లో నిర‍్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు. నాగర్జునసాగర్‌లో నిర్వహించే బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 3 గంటలకు షాద్‌నగర్ సభలో మాట్లాడి తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు.
సాధ్వి ఉదయ 11 గంటలకు పరిగి బహిరంగ సభకు హాజరై మాట్లాడుతారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు బీజేపీ తాండూరులో నిర్వహించే రోడ్ షోలో ఆమె పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment