మోదీని తక్కువ అంచనా వేయొద్దు.. విజయం మాదే | BJP Leaders Says Dont Underestimate Power Of Narendra Modi | Sakshi
Sakshi News home page

డోంట్ అండరెస్టిమేట్‌ పవర్‌ ఆఫ్‌ మోదీ

Published Sat, Dec 8 2018 8:05 PM | Last Updated on Sat, Dec 8 2018 8:30 PM

BJP Leaders Says Dont Underestimate Power Of Narendra Modi - Sakshi

ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌కు స్వల్పసంతోషాన్ని కలిగించేవి.. ఎన్నికల ఫలితాల రోజు కాంగ్రెస్‌కు రిక్త హస్తమే..

సాక్షి, న్యూ ఢిల్లీ: తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో జాతీయ మీడియ సంస్థలు, పలు సర్వేసంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. తాజా ఎగ్జిట్‌ఫోల్స్‌ ఫలితాల ప్రకారం ఐదు రాష్ట్రాల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ ఆగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీని అందరూ తక్కువ అంచనా వేస్తున్నారని.. అయన నాయకత్వంలో బీజేపీకి గెలుపే తప్పా ఓటముండదని తేల్చిచెబుతున్నారు. 

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ కూడా ఎగ్జిట్స్‌పోల్స్‌ ఫలితాలను తిప్పి కొట్టారు. ‘ప్రజానాడి తెలిసిన నేతను, ప్రజలతో ప్రయాణం చేశాను. వారిని కలిశాను. నేనే పెద్ద సర్వేయర్‌ను. ఎవ్వరూ ఊహించని విధంగా మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో  బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుంది’ అంటూ శివరాజ్‌ సింగ్‌ జోస్యం చెప్పారు.

ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌కు స్వల్పసంతోషాన్ని కలిగించేవని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్‌ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల రోజు కాంగ్రెస్‌కు రిక్త హస్తం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలకు భిన్నంగా మోదీ-షా నాయకత్వంలోని బీజేపీ అఖండ విజయాన్ని సాధిస్తుందని మరో బీజేపీ నేత ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement