
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో టీవీ ప్రచారంలో బీజేపీయే అందరికన్నా ముందుంది. ఎంతలా అంటే.. టీవీ పెడితే చాలు బీజేపీ అడ్వయిర్టైజ్‌మెంటే కనపడేంతగా. ఈ లిస్టులో బీజేపీ తర్వాతే మిగిలిన కంపెనీ బ్రాండ్‌లున్నాయని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది. హిందుస్థాన్ యునిలివర్, రాకెట్ బెన్కీసర్, అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, విమల్ పాన్‌మసాలా, ట్రివాగో, డెటాల్, విప్రో తదితర ప్రకటనలు బీజేపీ యాడ్ల తర్వాతి స్థానాన్ని ఆక్రమించాయి.
తాజా వారాంతపు నివేదికల్లో ఈ విషయం వెల్లడైందని బార్క్ తెలిపింది. అన్ని చానెళ్లలో బీజేపీయే అతిపెద్ద అడ్వయిర్టైజర్ అని వెల్లడించింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే.. ప్రకటనల జాబితాలో టాప్–10లోనూ లేకపోవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు పూర్తవగా మధ్యప్రదేశ్, మిజోరంలలో నవంబర్ 28న, తెలంగాణ, రాజస్తాన్‌లలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల విషయంలో ఇప్పుడే అసలు వేడి మొదలవుతుందని.. అందుకే బీజేపీ టీవీ యాడ్‌ల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment