మాట్లాడుతున్న పీఏసీ చైర్మన్ బుగ్గ
డోన్(కర్నూలు): అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పీఏసీ చైర్మన్, డోన్ శాసన సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సాయి ఫంక్షన్ హాల్‌లో పార్టీ పట్టణ అధ్యక్షుడు కోట్రికె హరికిషన్ అధ్యక్షతన సోమవారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బుగ్గన మాట్లాడుతూ..ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. బోగస్ ఓట్లు నమోదు కాకుండా జాగ్రత్తవహించాలన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకు చెందిన ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని బుగ్గన ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకురావడంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాబోయే ఆరునెలలు పార్టీ కార్యకర్తలకు పరీక్షా సమయమని, కష్టించి పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు జహంగీర్, ఊటకొండ మోహన్‌రావ్‌లు ఇటీవల మృతిచెందడంతో సమావేశంలో సంతాపం ప్రకటించారు.
జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, పార్టీ సీనియర్ నాయకులు ఏసీ పుల్లారెడ్డి, బోరెడ్డి శ్రీరాంరెడ్డి, మల్లెంపల్లె రామచంద్రుడు, రాజానారాయణ మూర్తి, సీమ సుధాకర్ రెడ్డి, బేతంచర్ల ఎంపీపీ గంజి క్రిష్టమ్మ, పార్టీ నాయకులు బుగ్గన నాగభూషణం రెడ్డి, లక్ష్మిరెడ్డి, ముర్తుజావలి, ఖాజా, దినేష్ గౌడ్, పోస్ట్రుపసాద్, ఆర్‌ఈ రాజవర్ధన్, రాజశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, హనుమంత రెడ్డి, గొల్ల సుధాకర్, సోమశేఖర్, భాస్కర్ రెడ్డి, బోరా మల్లికార్జున రెడ్డి, మహేశ్వర రెడ్డి, జంగం చంద్రశేఖర్, దారా ప్రతాప్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కటికవేణు, హనుమంత రెడ్డి, ఎద్దుపెంట వెంకటేశ్వర్లు, మహేంద్ర , కటిక మహేష్, చిరంజీవి, రఫీ, తాడూరు సంజప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment