
విశాఖపట్నం: కొన్నాళ్ల గ్యాప్ తరువాత ఏపీ మంత్రి నారా లోకేశ్ మళ్లీ నోరుతెరిచారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి అహర్నిషలూ కాపలా కాసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని బాంబు పేల్చారు. ఏడుకొండల జోలికి వస్తే మాడిమసైపోతారని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించింది చంద్రబాబేనని గుర్తుచేశారు. టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో లోకేశ్ తనదైన శైలిలో ప్రసంగించారు.
టీటీడీలో అక్రమాలా?: ‘‘విభజన హామీలు, ప్రత్యేక హోదా పోరాటం నుంచి దృష్టిని మరల్చడానికే బీజేపీ వాళ్లు వెంకన్నను దించారు. టీటీడీలో అన్యాయాలు జరుగుతున్నాయంటున్నారు. మనలో ఐక్యతను కూలగొట్టడానికే కుట్రలు చేస్తున్నారు. అసలు వెంకన్నకు అహర్నిషలు కాపలా కాసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారే. 68 ఏళ్ల వయసులో ఇంతగా కష్టపడుతున్న ఆయనకు.. హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సిన బీజేపీ.. ఆ పని చేయకుండా రాజకీయాలు చేస్తోంది. చంద్రబాబు పిలుపు మేరకు 2019లో జనం బీజేపీకి సినిమా చూపెడతారు’’ అని లోకేశ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment