
కార్యక్రమంలో మాట్లాడుతున్న పవన్
సాక్షి, హైదరాబాద్ : రాజకీయాల్లో తన వెంట నడవాలని చిరంజీవి అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కోరారు. బాధ్యతాయుతంగా చాలా క్రమశిక్షణతో రాజకీయాలు నిర్వర్తిస్తానని వారికి హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ నేతృత్వంలో మెగా అభిమానుల ఆత్మీయ సదస్సు జరిగింది. పలువురు మెగా ఫ్యామిలీ అభిమానులు జనసేన పార్టీలో చేరారు.
అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.రవీంద్రబాబు, తెలంగాణ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నందకిషోర్, జనరల్ సెక్రటరీ బి.విల్సన్‌బాబు, జంట నగరాల చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌అహ్మద్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల చిరంజీవి యువత అధ్యక్షులు కె.రామకృష్ణ, కె.నగేష్, బి.జి.నాగేంద్రకు పవన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన పార్టీ బయట వారిది కాదని, చిరంజీవి అభిమానులదేనని పవన్ తెలిపారు.