పేద ముఖ్యమంత్రి నిరుపేద అయ్యారు | CM Manik Sarkar Turns Even Poorer After Five Terms | Sakshi
Sakshi News home page

పేద ముఖ్యమంత్రి నిరుపేద అయ్యారు

Published Tue, Jan 30 2018 6:08 PM | Last Updated on Tue, Jan 30 2018 6:08 PM

CM Manik Sarkar Turns Even Poorer After Five Terms - Sakshi

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌

అగర్తలా : త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ (69) దేశంలో అత్యంత నిరుపేద ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సోమవారం శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఆయన రూ. 1,520/-లను తన ప్రస్తుత ఆస్తిగా చూపారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 2,410లు ఉన్నాయి. 2013లో ఎన్నికల సమయంలో ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 9,720/-లు మాత్రమే ఉన్నాయి.

1998 నుంచి త్రిపుర ముఖ్యమంత్రిగా సర్కార్‌ వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో ధన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయన.
ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నందుకు సర్కార్‌కు వచ్చే వేతనం రూ. 26,315/-. ఈ మొత్తాన్ని అంతటిని పార్టీ నిధికి డొనేట్‌ చేస్తారు. ఇలా చేసినందుకు ఆయనకు నెలకు రూ. 9,700/-లను పార్టీ అలవెన్సుగా ఇస్తుంది.

అఫడవిట్‌లో తన పేరిటలో 0.0018 ఎకరాల వ్యవసాయేతర భూమి అగర్తలాలో ఉన్నట్లు సర్కార్‌ వెల్లడించారు. సర్కార్‌ మొబైల్‌ ఫోన్‌ను వినియోగించరు. ఆయనకు ఈ-మెయిల్‌ అకౌంట్‌ కూడా లేదు. సర్కార్‌ భార్య తరచూ అగర్తలాలోని రిక్షాల్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement