ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌ | Congress Chhattisgarh VICE President Resigns | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌

Nov 12 2018 10:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Chhattisgarh VICE President Resigns - Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ గనారామ్‌ సాహూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. తొలి దశ ఎన్నికల ముందు సాహూ పార్టీని వీడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల ముందు పార్టీ ముఖ్య నేత రాజీనామా చేయడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. రాజీనామాకు సరైన కారణమేమీ తెలపకపోయినా.. ఆయన కోరుకున్న దుర్గ్‌ సిటీ సీటు విషయంలో పార్టీ ఆయనకు మద్దతుగా నిలవలేదన్న​ నిరాశతో రాజీనామా చేశారని పార్టీ నేతలు భావిస్తున్నారు.

కాగా తుది దశ పోలింగ్‌లో భాగంగా సోమవారం 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాటిలో కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలు 12. గత పదిహేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి ఎలానైనా అధికారం చేజికిచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. నాలుగోసారి కూడా తమదే విజయమని సీఎం రమణ్‌సింగ్‌ ధీమాతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement