సీఎం కమల్‌నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వందేమాతరం గీతం విషయంలో వివాదం నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో ప్రతి నెలా మొదటి పని దినం నాడు వందేమాతరం ఆలపించడం 13 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మంగళవారం నిలిపివేసింది. దీంతో బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరుద్ధరించుకోవాలని.. లేని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలందరం కలిసి అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యే (7వ తేదీ) నాడు వందేమాతరం పాడతామని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సీఎం కమల్‌నాథ్ సూచనల మేరకే వందేమాతరం పాడటం నిలిపివేశారని చౌహాన్ ఆరోపించారు. వందేమాతరం పాడకపోవడంపై వస్తున్న విమర్శలను కమల్‌నాథ్ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment