
మైసూరు: లవ్‌జిహాద్ పేరుతో హిందూ యువతులపై పీఎఫ్‌ఐ,ఎ స్‌డీపీఐ, కేఎఫ్‌డీ సంస్థలు పాల్పడుతున్న ఆకృత్యాల గురించి తెలిసినా ఓటు బ్యాంకు కోసం వాటిని చూసీ చూడనట్లు ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా ఆయా ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని మైసూరు నగర బీజేపీ ఇన్‌చార్జ్ రవిశంకర్ ఆరోపించారు. మంగళవారం నగరంలోని నజరాబాద్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం హిందూ సంఘాల బీజేపీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment