
చల్లపల్లి (అవనిగడ్డ): దేశంలో హిందీ భాషను అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలనే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2022 నాటికి భారతదేశం మొత్తం హిందీ భాష అమలు జరగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు అమిత్ షా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు.
సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల యూనియన్‌గా కొనసాగుతున్న భారతదేశ ఫెడరల్ విధానానికి బీజేపీ తూట్లు పొడుస్తోందన్నారు. దేశంలో ఎవరి భాష వారికి అత్యంత ముఖ్యమైందని, భాషల మధ్య భేదాలను రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదన్నారు.