సాక్షి, చిత్తూరు: మద్యపాన నిషేధం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇష్టం లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు చేస్తోన్న కుట్ర రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులతో మద్యం అమ్మిస్తున్నామని మాట్లాడటం సిగ్గుచేటని..మతి భ్రమించి చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘నాటుసారాను టీడీపీ కార్యకర్తలతో అమ్మించే కుట్ర జరుగుతుందని..కల్తీ మద్యం సరఫరాకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని’ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేయటానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
చంద్రబాబు సహించలేకపోతున్నారు..
తాను తప్పుడు కేసులు పెట్టిస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చంద్రబాబు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు. వెన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు పదవుల్లోకి వచ్చారని ధ్వజమెత్తారు. దశలవారీగా మద్యం నిషేధించడమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో దళితులకు తీవ్ర ద్రోహం జరిగిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..మంత్రివర్గంలో దళితులకు పెద్దపీట వేశారని నారాయణ స్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment