
(బాబుభాయ్ బొకిరియా - బీజేపీ)
సాక్షి, అహ్మదాబాద్ : దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం బీజేపీ అభ్యర్థినే వరించింది. బీజేపీ మత్యశాఖ మంత్రి బాబుభాయ్ బొకిరియా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనియర్ నేత అర్జున్ మోద్వాడియాపై విజయం సాధించారు. పోరుబందర్ స్థానంలో పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 1,855 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
సోమవారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లెక్కింపులో రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయంవైపు దూసుకెళ్లింది. రెండు చోట్ల కూడా స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించనుంది. ప్రస్తుతం ఫలితాలు ప్రకటించడమే మాత్రమే ఆలస్యం.. దాదాపు బీజేపీ విజయం ఖాయం అయింది.
Comments
Please login to add a commentAdd a comment