సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై కేంద్రం మోసపూరిత వైఖరిని మూడేళ్ల కిందట అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగడుతూ చెప్పిన అంశాలనే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో చెప్పుకొచ్చారు.
ప్రత్యేక హోదాకు 14వ ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరం చెప్పలేదని, ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము సిఫార్సు చేయలేదని స్వయంగా 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించిన విషయాన్ని అసెంబ్లీలో జగన్ పేర్కొన్నారు.
ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము సూచించలేదని పేర్కొంటూ కమిషన్ సభ్యులు అభిజిత్ సేన్ లేఖ రాశారని, మరో సభ్యుడు గోవిందరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అసెంబ్లీలో జగన్ తేల్చిచెప్పారు. హోదాను మించి కేంద్రం ప్యాకేజ్ రూపంలో సాయంచేస్తుందని చెబుతూ ప్యాకేజ్‌ను సీఎం చంద్రబాబు స్వాగతించడాన్ని జగన్ తప్పుపట్టారు. అయితే లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సరిగ్గా జగన్ ప్రస్తావించిన అంశాలనే గల్లా జయదేవ్ లోక్‌సభలో వల్లె వేశారు.
Comments
Please login to add a commentAdd a comment