మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
అహ్మదాబాద్: గుజరాత్‌లో అధికార బీజేపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించనుందని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. రెండో దశ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మోదీ తొలిసారిగా ఈ ఎన్నికల్లో అవినీతిపైగానీ రైతుల గురించిగానీ ప్రస్తావించలేదు.
బీజేపీకి రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తుండటం వల్లే ఆయన ఈ అంశాల జోలికి వెళ్లలేదేమో’ అని ఎద్దేవా చేశారు. పాటీదార్లు, ఓబీసీలు, దళితులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరిలోనూ ఆ పార్టీపై వ్యతిరేకత పెల్లుబికుతోందని, దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో జబర్దస్త్ ఫలితాలు రానున్నాయని, కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టనున్నారని పునరుద్ఘాటించారు. రాజకీయాలనేవి ప్రేమతో చేయాలి తప్ప అసూయా ద్వేషాలతో కాదన్నారు. తాను గుజరాత్‌లోని దేవాలయాలను సందర్శిం చడంపై వస్తున్న విమర్శల పట్ల రాహుల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం దేవుళ్లను ప్రార్థించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment