సాక్షి,బరూచ్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగలనుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.గుజరాత్‌లో బీజేపీకి భంగపాటు తప్పదు...ప్రజలు వాస్తవాలను గుర్తెరిగి బీజేపీని సాగనంపుతారు..రానున్న గుజరాత్ ప్రభుత్వం రైతులు, పేదలు, చిరువ్యాపారులదేనని, మోదీకి చెందిన పారిశ్రామికవేత్తలది కాదని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత ర్యాంక్‌పై మురిసిపోతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సన్నకారు రైతులు, చిరువ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించాలన్నారు. మోదీ సర్కార్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాత్రం ప్రయోజనాలు దక్కించుకుంటున్నారని ఆరోపించారు.
బ్యాంకులకు టోపీపెట్టి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా లండన్‌లో ఎంజాయ్ చేస్తుంటే మోదీ ఏం చేశారని మోదీ నిలదీశారు.దేశంలోప్రముఖ పదిమంది వాణిజ్యవేత్తలే ప్రభుత్వ విధానాలతో లబ్ధి పొందారని అన్నారు.ప్రధాని చేపట్టిన మేక్ ఇన్ ఇండియాపైనా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఒకే జనాభా కలిగిన భారత్,చైనాలను తీసుకుంటే చైనా ఏటా 50,000 ఉద్యోగాలను సృష్టిస్తోంటే భారత్‌లో ఏటా కేవలం 450 ఉద్యోగాలే అందుబాటులో ఉంటున్నాయని అన్నారు.
గుజరాత్‌లోనే 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలు కష్టపడి పనిచేస్తే వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని జీఎస్‌టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా రాహుల్ అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment