
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ చర్యలు చేపడితే మీకెందుకు భయం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబు డ్రామాగా చిత్రీకరించారంటూ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, అనేక సందర్భాల్లో ఆయన మాట మార్చారని అన్నారు.
ఏపీలో ఉన్నది అధ్వాన్న ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైన వారు వేలకోట్ల రుణాలు లబ్ధిపొంది విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. అవినీతి, అసూయతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment