ఇస్లామాబాద్ : భారత్‌తో సంబంధాల విషయమై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత దాయాదితో ‘నాగరికమైన బంధం’ ఉంటుందని తమ దేశం ఆశిస్తోందని ఆయన పేర్కొన్నారు. మిగతా దేశాలతో పాక్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, భారత్‌తో అనుబంధం అనేది ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు సమస్యగా మారిందని తెలిపారు.
‘ఆఫ్ఘనిస్థాన్‌లో ఏం జరిగినా అది పాక్ సరిహద్దుల్లో ప్రభావం చూపిస్తోంది. కాబట్టి ఈ ప్రాంతంలో శాంతి కోసం మేం పనిచేస్తున్నాం. ఇరాన్‌తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ బంధాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం. ఇక సమస్యల్లా భారత్‌తో ఉన్న సంబంధాల విషయంలోనే’ అని ఇమ్రాన్ పాక్ సర్కార్ న్యూస్ ఏజెన్సీ ఏపీపీతో పేర్కొన్నారు. ‘భారత్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగుతాయని మేం ఆశిస్తున్నాం’ అని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment