
బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు(పాత చిత్రం)
తిరుమల : టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే వైఎస్సార్సీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని, విడిగా పోటీ చేస్తే టీడీపీ పతనం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడి గ్రాఫ్ పడిపోయిందని, అలాగే ఇప్పుడు వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరిగిందని వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికల పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తిరుపతిలో చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మపోరాటం కాదని, అధర్మ పోరాటమని ఎద్దేవా చేశారు. పట్టిసీమపై 15 రోజులలో సీబీఐ చేత విచారణ చేయించాలని కోరతామని తెలిపారు. విచారణ జరిగితేనే దోషులకు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహర్ రెడ్డి ఏం చెబితే..చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడని చెప్పారు.