
సాక్షి, గోపాలపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గోపాలనగరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి అతని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు. దీంతో ఎంపీ జేసీకి ఎదరుదెబ్బ తగిలింది. రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోవిజయవంతంగా కొనసాగుతుంది.