Kogatam vijaya bhaskar Reddy
-
ప్రభాకరా.. అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకో
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘గత ప్రభుత్వ నిర్వాకంతో నగరంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. రూ.191 కోట్ల పైప్‌లైన్ పనులు సకాలంలో చేయించకపోవడంతో ప్రపంచ బ్యాంకు నిధులు వెనక్కు వెళ్లాయి. ఏపీఎండీపీ పైప్‌లైన్, అమృత్ స్కీం పనులు సాగక నగరం గుంతలమయం అవడానికి, ప్రజల కన్నీటి కష్టాలకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యమే కారణం. ఇప్పటికైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోగటం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నగరాభివృద్ధికి ఎమ్మెల్యే ‘అనంత’ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రూ.15 కోట్లతో పైప్‌లైన్ పనులు జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. రూ.4 కోట్లతో పైప్‌లైన్ కోసం తీసిన గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. సర్వజనాస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రూ.250 కోట్లతో 700 పడకల సామర్థ్యంతో అదనపు భవనం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, ఈ విషయంలో ఎమ్మెల్యే అనంత కీలకంగా వ్యవహరించా రన్నారు. స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్‌పై సకా లంలో స్పందించి, తిరిగి వారు సర్వజనాస్పత్రికి వచ్చేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని ప్రభాకర్‌చౌదరి.. ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి లేఖ రాస్తామని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు. ఆపరేషన్ కోసం ఇతర ప్రాంతానికి వెళితే దాన్ని బూతద్దంలో చూడడం సరికాదన్నారు. త్వరలోనే ఆయన నగరానికి రానున్నారని, గత ప్రభుత్వం కంటే భిన్నంగా అభివృద్ధి చేసి చూపుతారన్నారు. -
టీడీపీ పోలీసు అస్త్రం
అనంతపురం న్యూసిటీ: ఓటమి భయంతో టీడీపీ నేతలు పోలీసులను అస్త్రంగా చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినా తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే జన్మభూమి గ్రామసభలో ప్రజల తరపున నిలిచిన వైఎస్సార్సీపీ నేత కోగటం విజయభాస్కర్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కనీస విచారణ చేపట్టకుండా.. ఎస్పీకి వాస్తవాలు తెలియకుండా.. ఉన్నఫళంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం చూస్తే టీడీపీ కుట్ర స్పష్టంగా అర్థమవుతోంది. పైగా శని, ఆదివారాలతో పాటు పండగ సెలవుల దృష్ట్యా బెయిల్‌కు అవకాశం లేకుండా చేయడం చూస్తే టీడీపీ ముఖ్యనేత ఒత్తిళ్లకు ఏ స్థాయిలో తలొగ్గారో ఇట్టే తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నగరంలోని 4వ డివిజన్లో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోగటం శ్రీదేవి ప్రజా సమస్యలపై మాట్లాడారు. ఆ డివిజన్‌కు ఎలాంటి సంబంధం లేని కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి జోక్యం చేసుకుని గతంలో పింఛన్ తీసుకునే వారంతా దొంగలని సంబోధించాడు. దీనిపై జన్మభూమి కార్యక్రమంలో ఉన్న కోగటం విజయభాస్కర్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. కార్పొరేటర్ అడిగిన ప్రశ్నలకు జావాబుదారీగా ఎమ్మెల్యే, మేయర్ సమాధానమివ్వాలని, నీవెందుకు జోక్యం చేసుకుంటున్నావని నిలదీశారు. ఈ క్రమంలో త్రీటౌన్ సీఐ బాలమద్దిలేటి, ఎస్సై క్రాంతికుమార్ ‘కోగటం’ను అడ్డుకుని బయటకు పంపారు. సాయంత్రం కోగటం విజయభాస్కర్‌రెడ్డి తన వ్యక్తిగత పని మీద మూడో రోడ్డులో ఉన్న ఆడిటర్ గంగిరెడ్డిని కలిసేందుకు వెళ్లారు. ఆ సమయంలో కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి అనుచరులు మిస్సమ్మ కాలనీ నాగరాజు, గోవిందు.. ‘‘లక్ష్మిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి.. కోగటం డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. అయితే కోగటం పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఆయన అనుచరుడు రవి మూడో రోడ్డు మీదుగా ఆడిటర్ వద్దకు వెళ్లబోయాడు. మార్గమధ్యంలో మిస్సమ్మ కాలనీ నాగరాజు, గోవిందు(తప్పతాగి ఉన్నారు) రవిపై కర్రతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఫిర్యాదుకెళితే దుర్భాషలు కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి, వారి అనుచరుల గొడవ నేపథ్యంలో కోగటం ఇంటి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఎస్సైలు జయపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనంతరం కోగటం తన భార్య కార్పొరేటర్ కోగటం శ్రీదేవితో కలసి కేసు నమోదుకు త్రీటౌన్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కూర్చొనే ప్రయత్నం చేయగా సీఐ బాలమద్దిలేటి ‘‘ఏయ్ లెయ్ ఫస్ట్. నీవేం రౌడీషీటర్లా వ్యవహరిస్తున్నావ్. ఏమనుకున్నావ్’’ అంటూ దుర్షాషలాడారు. కోగటం దంపతులు తాము ఫిర్యాదు చేసేందుకు వచ్చామని, మీకు ఇష్టం లేకపోతే ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం’’ అని చెప్పగా సీఐలు రాజశేఖర్, ఆరోహణరావు, ఎస్సై క్రాంతికుమార్ కోగటం విజయభాస్కర్ రెడ్డిని నోటికొచ్చి నట్లు మాట్లాడారు. పోలీసులు వ్యవహరించిన తీరుతో కోగటం శ్రీదేవి కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రికి రాత్రి అట్రాసిటీ కేసు టీడీపీ వర్గీయుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కోగటం విజయభాస్కర్‌రెడ్డిపై కుట్రపూరితంగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కనీస విచారణ చేపట్టకుండానే పోలీసులు ఇలాంటి కేసు నమోదు చేయడం వెనుక టీడీపీ ముఖ్య నేత హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాత్రికి రాత్రి పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఇదిలాఉంటే విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు అనంత వెంకటరామిరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, వైటీ శివారెడ్డి, పెన్నోబిలేసు, వెన్నపూస రవీంద్రారెడ్డి, శ్రీదేవి తదితరులు పోలీసుస్టేషన్‌కు చేరుకొని త్రీటౌన్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి 12 గంటల సమయంలో ధర్నా నిర్వహించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన జేసీ దివాకర్ ముఖ్య అనుచరుడు
-
వైఎస్సార్సీపీలో చేరిన జేసీ ముఖ్య అనుచరుడు..
సాక్షి, గోపాలపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గోపాలనగరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి అతని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు. దీంతో ఎంపీ జేసీకి ఎదరుదెబ్బ తగిలింది. రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోవిజయవంతంగా కొనసాగుతుంది. -
ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకోం
అనంతపురం రూరల్: అనంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై కోగటం విజయభాస్కర్‌రెడ్డి విమర్శలు చేయడం అన్యాయంగా ఉందనీ, అభివృద్ధిని కాంక్షిస్తున్న ఎమ్మెల్యేపై అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బంగి నాగేంద్ర, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కోగటం లాంటి నేతలకు నగర అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఎక్కడి నుంచే అనంతకు వలస వచ్చిన విషయాన్ని కోగటం గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచి దన్నారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మారుతి కుమార్, నాయకులు కదిరెప్ప, మేదర చంద్ర తదితరులు పాల్గొన్నారు.