
జగిత్యాల రూరల్: రాష్ట్రంలో పనిచేయని సర్పంచులను తొలగిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పటం హాస్యాస్పదంగా ఉందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. తొలగించాల్సిన పరిస్థితులు వస్తే పోచా రంనే ముందుగా తొలగించాలన్నారు. జగి త్యాల మండలం చల్‌గల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేబినెట్‌లో పనిచేయని మొదటి మంత్రి పోచారమే అని, రాష్ట్రంలో సాగు సంక్షోభంలో ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఖరీఫ్‌లో వరివేసిన రైతులు అకాలవర్షాలు, దోమపోటుతో నష్టపోయారని, నష్టం అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్షాలపై విశ్వాసం లేకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకుని రైతులను ఏ విధంగా ఆదుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన శాఖను చక్కదిద్దుకోలేని మంత్రి రాష్ట్రంలో సర్పంచులను పనిచేయలేదని కించపర్చడం విడ్డూరంగా ఉందన్నారు.