హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన అడ్డగోలుగా చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హైకోర్టును ఏపీకి తీసుకెళ్లవద్దని, ఇక్కడే ఇంకో భవనం చూసుకోమని తాము చెబితే, డిసెంబర్‌లోగా వెళ్లిపోతామని సుప్రీంకోర్టుకు అఫిడివిట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప‍్రగతి భవన్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేసీఆర్.. చంద్రబాబు మాట్లాడుతున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘చంద్రబాబు మనిషిలాగే మాట్లాడుతున్నారా. హైకోర్టును ఏపీకి తీసుకెళ్లరాదని..ఇక్కడే ఇంకో భవనం చూసుకోవాలని మేము చెప్పాం. కాదు కాదు డిసెంబర్‌లోపే వెళిపోతామని సుప్రీంకోర్టుకు మీ ప్రభుత్వం అఫిడివిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి హైకోర్టు విభజనకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడేమో అడ్డుగోలుగా హైకోర్టు విభజన అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.
ఏది పడితే అది మాట్లాడితే అది చెల్లుతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ఒకటి రెండు తోక పత్రికలు బాబుకు వంత పాడుతున్నాయి. చంద్రబాబు తరహా దిగజారుడు చేసే రాజకీయ నాయకుడు ఎక్కడా ఉండడు. చంద్రబాబు మాటలకు తలాతోకా ఉందా. నాలుగేళ్లు మోదీ సంకనాకావ్. ఏ ముఖం పెట్టుకుని మోదీతో జత కట్టావ్. ఎందుకు బయటకొచ్చావ్.. ప్రత్యేక హోదా అవసరమే లేదన్నవ్.. ప్యాకేజీ కావాలన్నవ్. హోదా సంజీవిని కాదన్నవ్.. హోదా గురించి మాట్లాడితే జైల్లో వేస్తానన్నావ్. మళ్లీ ఇప్పుడు హోదాపై కేంద్రం అన్యాయం చేసిందంటున్నవ్. చంద్రబాబు మనిషిలాగే మాట్లాడుతున్నారా. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది జాగ‍్రత్త. చంద్రబాబు ఒక దద్దమ్మ. మా ఇండస్ట్రీయల్ పాలసీని బాబు దొంగిలించాడు. సైబర్ టవర్‌కు పునాది వేసింది చంద్రబాబు కాదు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాబు ఓడిపోతారు. చంద‍్రబాబుకు విలువల్లేవ్. నేను ప్రతిపాదించిన ఆర్థిక నమూనా గురించి చంద్రబాబుకు అవగాహన లేకుండా పోయింది. ఐటీలో కూడా చంద్రబాబు పీకిందేమీ లేదు. లేనిపోనివి ఆపాదించుకోవడం.. రంగులు పూసుకోవడం బాబుకే చెల్లింది’ అంటూ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే..
- బీసీల మీద కాంగ్రెసోళ్లు ప్రేమ ఒలకబోస్తున్నారు
- ప్రజల్ని వంచించేందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడతున్నారు
- మార్కెట్ కమిటీల్లో బీసీ రిజర్వేషన్ తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే
- ఇలా దేశంలోనే తొలిసారి చేసిన రాష్ట్రం తెలంగాణ
- ప్రతీ చోట బీసీలకు పెద్ద పీటే వేశాం
- 74 లక్షల గొర్రెలను పంపిణి చేశాం
- చేనేత కార్మికుల్లో వెలుగు నింపాం
- యాభై శాతం రిజర్వేషన్ మించొద్దని కాంగ్రెస్ కోర్టుకు పోయింది
- కూటమిగా జత కట్టక ముందే వారు కోర్టుకు వెళ్లారు
- యాభై శాతం మించి ఉండరాదన్న సుప్రీం తీర్పు కారణంగానే రిజర్వేషన్లను తగ్గించాల్సి వచ్చింది
- మేము ఉద్దేశ పూర్వకంగా బీసీల రిజర్వేషన్ తగ్గించలే
- మరొకవైపు హైకోర్టు ఆదేశాల మేరకు జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలు జరపాలి
- కోర్టు తీర్పులను ఫాలో కావాలే తప్ప.. ఏమీ చేయలేం
- బీసీలను నాశనం చేసింది మాత్రం కాంగ్రెస్, టీడీపీనే
- బీసీ విద్యార్థులకు ఓవరసీస్ స్కాలర్‌షిప్ రూ. 20 లక్షలు ఇస్తుంది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా
- హైదరాబాద్‌లో అన్ని వర్గాల వారికి ఆత్మ గౌరవ సభలు
- కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలనే చాలాసార్లు ప్రతిపాదించా
- ఉద్దేశపూర్వకంగా బీసీల రిజర్వేషన్ తగ్గించామని కట్టుకథలు అల్లారు
- 20 సీట్లు రాలేదు.. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారా
- పంచాయతీ ఎన్నికలు జరగకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారు
- కూకట్‌పల్లిలో హరికృష్ణ కూతురు సుహాసినిని చంద్రబాబు పోటీకి పెట్టాడు
- హరికృష్ణ మరణంతో శవ రాజకీయాలు చేయాలనుకున్నాడు
- శవ రాజకీయాలు చేసే సంస్కృతి చంద్రబాబుది
- దిక్కుమాలిన శ్వేత పత‍్రాలు విడుదల చేసి డబ్బా కొట్టుకుంటున్నారు
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో మా ఎంపీలు కేశవరావు, కవిత చెప్పింది రికార్డ్సులో లేదా
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మేము మొదట్నుంచీ కోరుతున్నాం.
- మేము ప్రత్యేక హోదాను అడ్డుకున్నామని టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
- ఏపీకి ప్రత్యేక హోదా.. మాకు రాయితీలు ఇవ్వాలని మేము కోరుతూనే ఉన్నాం
- టీఆర్‌ఎస్‌ను ఓడించాలనుకున్న అన్నీ పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు
- పసలేకుండా మాట్లాడి, అర్థం పద్దం లేకుండా మాట్లాడితే ఎలా ఉంటాదో చూశారు
- భారతీయ జనతా పార్టీ మాట్లాడిన దానికి అంతే లేదు
- 118 స్థానాల్లో..103 స్థానాల్లో డిపాజిట్ పోయింది
- ప్రజలు ఎంత దారుణంగా తిరస్కరించారో చూశారు కదా
Comments
Please login to add a commentAdd a comment