
సాక్షి, హైదరాబాద్: ‘స్వర్గానికైనా గేట్లు తెరుచుకోవచ్చుకానీ.. సీఎం కేసీఆర్ కార్యాలయం తలుపులు మాత్రం తెరుచుకోవని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో అర్థమవుతోంది’ అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, పెన్షన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుందని తెలిపారు. రాష్ట్ర పరిధిలోని అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బదిలీలపై శాశ్వత నిషేధం సరికాదన్నారు. పీఆర్సీ కోసం వెంటనే కమిటీ వేయాలని, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల పెన్షన్‌పై శాసనసభలో కేసీఆర్ చెప్పింది సరి కాదని, పెన్షన్ విధానం కేంద్రం పరిధిలోదని చెప్పి తప్పించుకోవద్దన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల కోసం బిల్లు పెట్టడం వల్ల చాలా అనర్థాలు తలెత్తుతాయని హెచ్చరించారు. అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించవద్దని ఎమ్మెల్యేలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment