
సాక్షి, హైదరాబాద్: దీపావళి పేలని చిచ్చుబుడ్డిగా డిసెం బర్ 7న టీఆర్‌ఎస్ తుస్సుమనడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలకు, కల్వకుంట్ల కుంటుంబానికి జరిగే ఎన్నిక ల్లో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు కాదు కదా.. అందులో నాలుగో వంతు సీట్లు కూడా రావన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా కూటమిని చూసి టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని, బావ బామర్దులు కలసి ఓట మి భయంతో బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజా కూటమి సీట్లన్నీ ఉమ్మడిగా ఒకేసారి ప్రకటించాలని చూస్తున్నామని చెప్పారు. కూటమి మిత్ర పక్ష పార్టీలు తమకు ఎన్ని సీట్లు కావాలో నివేది క ఇచ్చాయని, వాటిపై సర్వే కూడా చేయించామన్నా రు. దీపావళి రోజున లేదా ఆ తర్వాత కానీ సీట్ల ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలిపారు.