టీఆర్‌ఎస్‌ను మించిన గలీజు పార్టీ లేదు
మాజీ ఎంపీ మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ను మించి న గలీజు పార్టీ మరో టి లేదని, టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాబంధుల సమితి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ విమర్శించారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని విమర్శించారు.
ప్రజల సొమ్ము 300 కోట్లతో కట్టుకున్న బంగ్లాలో ఉంటూ, రైతులను పరామర్శిం చే తీరిక కూడా సీఎం కేసీఆర్‌కు లేద న్నారు. నకిలీ విత్తనాల కంపెనీలపై చర్య లు తీసుకోకుండా తన సామాజికవర్గం వారిని కాపాడుకుంటున్నారని ఆరోపిం చారు. జీహెచ్‌ఎంసీలో 100 కోట్ల అవినీతి జరిగిందని, మంత్రిగా బాధ్యుడైన కేటీఆర్ పై చర్య తీసుకోకుండా కేవలం ఓ అధికారి ని మాత్రమే సస్పెండ్ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని యాష్కీ ఆరోపించారు. కేసుల భయంతోనే కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నారని ఆరోపించారు.