కోల్‌కతా : కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బంధించి అక్కడికి మీడియాను కూడా అనుమతించడం లేదని తమకు సమాచారం అందిందని చెప్పారు. సంకీర్ణ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ బేరసారాలు సాగిస్తోందని దుయ్యబట్టారు.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ దేశాన్ని కబళించేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీకి అంత స్వార్ధం ఎందుకని ఆమె ప్రశ్నించారు. మరోవైపు కుమారస్వామి నేతృత‍్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. కుమార స్వామికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment