సాక్షి, వరంగల్ : ‘నేను ఇక్కడే పుట్టా. ఇక్కడే పెరిగా. నగర ప్రజల కోసం ఇక్కడే చస్తానంటూ’ వరంగల్ అర్బన్ నగర మేయర్ నరేందర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొండా సురేఖతో వివాదంపై ఆయన మీడియాతోమాట్లాడారు. 30 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న కొండా సురేఖ కేవలం తన మూడేళ్ల రాజకీయానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాను త్యాగం చేస్తేనే కొండా సురేఖ ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు. ఇంతకాలం పార్టీలో పనిచేశా కాబట్టి వరంగల్ తూర్పు టికెట్ అడిగే హక్కు తనకుందని, అధిష్టానం ఆదేశం మేరకు ఎవరైనా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.
‘నగర మేయర్‌కు, కార్పొరేటర్లది తండ్రీకొడుకుల అనుబంధం. అలాంటి నా వెంట ఉండే కొర్పొరేటర్లను కుక్కలు అనడం చాలా బాధాకరం. అలా చెప్పాలంటే మేం కుక్కలమే. టీఆర్‌ఎస్ పార్టీ కుక్కలం. తేడా వస్తే నర్సింహావతారం ఎత్తుతా జాగ్రత్త. ఎమ్మెల్యేగారు మీ భాషా దోరణిని మార్చుకోండి. పార్టీ నుండి ఎవరినీ సస్పెండ్ చేయడం మీ వల్ల కాదు. ఆ అవకాశం పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరికే సర్వహక్కులు ఉన్నాయని కూడా మరిచిపోయారా. రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దపీట వేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ కొండా సురేఖ మాకు, మైనార్టీలకు మధ్య చిచ్చుపెట్టాలని యత్నిస్తున్నారని’ మేయర్ నరేందర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment