టీఆర్‌ఎస్‌ ను వీడే ప్రసక్తే లేదు: కొండా సురేఖ | Konda Surekha couple condemns to join congress party | Sakshi
Sakshi News home page

నా రాజకీయ వారసురాలు సుస్మిత..

Published Sat, Jun 17 2017 3:38 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్‌ ను వీడే ప్రసక్తే లేదు: కొండా సురేఖ - Sakshi

టీఆర్‌ఎస్‌ ను వీడే ప్రసక్తే లేదు: కొండా సురేఖ

హైదరాబాద్‌ : పార్టీ వీడుతున్నట్లు వార్తలను కొండా సురేఖ కొట్టిపారేశారు. తాము టీఆర్‌ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. తనకు రాజకీయాల్లో జన్మనిచ్చింది వైఎస్‌ఆర్‌ అయితే పునర్జన్మనిచ్చింది కేసీఆర్‌ అని కొండా సురేఖ పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్‌ వీడుతున్నట్లు కొందరు దుష్ప్చచారం చేస్తున్నారని  ఆమె శనివారమిక్కడ అన్నారు.

ఇక  తన రాజకీయ వారసురాలు కుమార్తె సుస్మితా పటేల్‌ అని, అయితే 2019 ఎన్నికల్లో తమ కుమార్తె పోటీ చేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు.  కాగా కొండా సురేఖ సొంత గూటికి చేరుతారంటూ కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం  జరగడంతో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నామంటూ  తామంటే గిట్టనివారు  సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement