
సాక్షి,తాడేపల్లి : దళితుల భూములను చంద్రబాబు దౌర్జన్యంగా లాక్కున్నారని, ఇదేమని ప్రశ్నించిన దళిత ప్రజా ప్రతినిధులపై ఆయన దాడులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ఉద్యమం ముసుగులో చంద్రబాబు పెయిడ్ ఉద్యమం చేయిస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు అమరావతి నుంచి పారిపోయి వచ్చారని, అభివృద్ధి పేరుతో అమరావతి ప్రాంతంలోని రైతుల వద్ద వేలఎకరాలను లీజుకు తీసుకొని ఐదేళ్లలో రాజధాని ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, రాజధానిపై చేసిన దొంగ సర్వేలను ప్రజలు ఎవరు నమ్మొద్దని పేర్కొన్నారు. గతంలో ఎన్నికల సమయంలోనూ ఇలాంటి దొంగ సర్వేలను చేయించుకొని ఆయన భంగపడ్డారని నాగార్జున ఎద్దేవా చేశారు.(‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’)
తాము అధికారంలోకి వచ్చిన 7నెలల కాలంలో దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, దళిత జాతి యావత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దేవుడిలా ఆరాధిస్తుందని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జగన్‌దేనని తెలిపారు. మూడు రాజధానులకు అనుకూలంగా బుధవారం జరిగిన ఎస్సీ సెల్ విభాగంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని నాగార్జున పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment