
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంగళవారం లేఖ రాశారు. జిల్లా ప్రజలు ఎంతో ఆశపెట్టుకున్న కడప రిమ్స్ ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని, ఇటీవల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి సరైన వైద్యం అందక మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. రిమ్స్‌లో వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలని కోరారు. సీటి స్కాన్‌లు ఏర్పాటు చేసి రోగులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఎంతో మంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఆధారపడిన ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment