
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ట్విటర్ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా.. 'నిత్య కళ్యాణం' గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే.. సీజన్‌లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై దోమలకు కష్టకాలమే అంటూ ట్వీట్ చేశారు.
ఇక చంద్రబాబు చేసిన ఇసుక దీక్షపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. 'ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడు. ఎప్పుడైనా కరువు పైన దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment