
సాక్షి, ప్రకాశం : ఇంత ఘోరమైన ప్రమాదం జరిగినా రెస్క్యూటీమ్ గంట వరకు ఘటనా స్థలానికి చేరుకోలేదంటే చంద్రబాబు పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కృష్ణానదిలో జరిగిన ప్రమాద ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.
బోటు ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే పూర్తి కారణమని ఆయన చెప్పారు. ప్రభుత్వం తమ తప్పులు బయటపడతాయన్న భయంతోనే రాత్రికి రాత్రి మృతదేహాలను ఒంగోలుకు తరలించారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎంత చేసినా తక్కువేనన్న ఆయన.. ఆర్థిక సాయాన్ని తక్షణమే 20 లక్షలను పెంచాలని.. ఘటనకు బాధ్యులైన వారు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాలని వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.