
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఈ నెల 19న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను మర్యాదపూర్వకంగా కలిశారని, 19న టీడీపీలో బేషరతుగా చేరుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బుచ్చిలింగం వెల్లడించారు. నందీశ్వర్‌గౌడ్ 2014 ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లారు.
ఆ తర్వాత తన రాజకీయ గురువు డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో గత నెలలో ఆయన కాంగ్రెస్ ముఖ్య నేతలు కుంతియా, ఉత్తమ్‌లను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమి పరిణా మాల నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ పక్షాన టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో టీడీపీలో చేరుతున్నారని తెలుస్తోంది. పటాన్‌చెరు అసెం బ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీ కారం తెలిపిందని, ఆయన టీడీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి బరిలో దిగుతారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment